గందరగోళం లేకుండా,సాగు చేస్తున్న ప్రతి సెంటు వ్యవసాయ భూమికి రైతు భరోసా ఇవ్వాలి: కొల్లు
కోదాడ ,ఫిబ్రవరి 25. (వాయిస్ టుడే ప్రతినిధి) సాగు చేస్తున్న ప్రతి సెంటు వ్యవసాయ భూమికి రైతు భరోసా సాయం అందించాలని తెలుగు రైతు సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోదాడలో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో రోజుకో తీరులో వార్తలను ప్రచారంలోకి తెస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తుందని ఆరోపించారు. ఒకరోజు ఐదు ఎకరాల వారికే నని, మరోరోజున సాగులో లేని వ్యవసాయ భూములకు రైతు భరోసా సాయం లేదని ప్రచార మాధ్యమాలలో వస్తున్నా వార్తలు రైతులలో గందరగోళం కలిగిస్తున్నాయని చెప్పారు. డీజిల్, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు, కొరత అయినందున, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేనందున, వ్యవసాయం చేయటంతో నష్టం తప్ప లాభం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. కనుక ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకైనా కేవలం తను సాగు చేస్తున్న ప్రతి సెంటు భూమికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సాయం అందించాలని, చెమటోడ్చి కష్టపడు తున్నప్పటికీ ఆర్ధికంగా నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు ,డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పెట్టుబడికి అదనంగా 50 శాతం ఇచ్చి, వ్యవసాయ రంగాన్ని, దేశానికి వెన్నెముకైనా రైతులను బ్రతికించాలని వెంకటేశ్వరరావు కోరారు.
సాగు చేస్తున్న ప్రతి సెంటు వ్యవసాయ భూమికి రైతు భరోసా ఇవ్వాలి
- Advertisement -
- Advertisement -