- Advertisement -
ముందుకు సాగని రైతు కమిషన్
A farmer's commission that did not advance
హైదరాబాద్, నవంబర్ 7, (వాయిస్ టుడే)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. జీవో నెంబర్ 36తో దీన్ని ఏర్పాటు చేసి, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డిని చైర్మన్‌గా నియమించింది. భూ చట్టాల నిపుణుడు సునీల్‌తో సహా మరో ఆరుగురు సభ్యులుగా ఈ కమిషన్ ముందుకెళ్తోంది. మొదటి సమావేశం బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జరిగింది. అయితే, కమిషన్‌కు సంబంధించి అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. విద్యా కమిషన్‌కు వసతులు ఆగమేఘాలపై ఏర్పాటు కాగా, రైతు కమిషన్‌పై మాత్రం అశ్రద్ధ వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.బీఆర్‌కే భవన్‌లో కమిషన్ ఏర్పాటైంది కానీ, సరైన సౌకర్యాలు చేయలేదు సంబంధిత అధికారులు. కనీస వసతులు, కావాల్సిన సిబ్బంది లేక ఇబ్బంది పడుతున్నారు సభ్యులు. చాంబర్లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు ఉన్నతాధికారులు. ప్రస్తుతం చైర్మన్ కోదండ రెడ్డి కోసం ఒక చాంబర్ ఏర్పాటు చేయగా, అందులో వాష్ రూమ్‌కు డోర్ లేని పరిస్థితి. ఎవరైనా వాష్ రూమ్‌కు వెళ్లాలంటే మరొకరు దగ్గరలో నిలబడాల్సి వస్తోంది. వచ్చిన గెస్టులు దీన్ని చూసి షాక్ అవుతున్నారు. ఈ పరిస్థితి చూసి బాధ్యతలు తీసుకోడానికి సభ్యులు వెనుకాడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తోంది.బాధ్యతలు తీసుకున్న మెంబర్లు చాంబర్ల లేక చైర్మన్ రూమ్‌లోనే కూర్చుంటున్నారు. ఈ పరిస్థితి చూసి రాములు నాయక్ తనకు పదవి వద్దని అంటున్నట్టు సమాచారం. ఓవరాల్‌గా ఈ వ్యవహారం చూశాక, అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే, కిందిస్థాయిలో అధికారులు నీరుగార్చే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రఘునందన్‌కు కమిషన్ ఏర్పాటు ఇష్టం లేదనే టాక్ వినిపిస్తోంది. అందుకే, కమిషన్ ఏర్పాటుపై జీవో ఇవ్వడానికి ఈయన మొదట్లో ఆలస్యం చేశారని అనుకుంటున్నారు.రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకుంటోంది ప్రజా ప్రభుత్వం. ఇప్పటికే రుణమాఫీ అందించి ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. వారి అవసరాల కోసం ప్రభుత్వం రైతు కమిషన్‌ను ఏర్పాటు చేస్తే, అధికారులు మాత్రం దీన్ని పెత్తనంగా భావిస్తున్నారు. అందుకే, పైసా కూడా వ్యవసాయ శాఖ నుండి విడుదల కావడం లేదట. దీంతో సొంత ఖర్చులతోనే టీ, స్నాక్స్ తెప్పించుకుంటున్నారు సభ్యులు. అంతేకాదు, సొంత మనుషులనే సిబ్బందిగా వాడుకుంటున్నారట. ఈ ఇష్యూని సీఎం దృష్టికి తీసుకెళ్లే పనిలో కమిషన్ చైర్మన్, సభ్యులు ఉన్నారురైతు కమిషన్‌పై సీఎం రేంత్ రెడ్డి ఎంతో కృతనిశ్చయంతో ఉన్నారు. రైతుల పట్ల ఉన్న ప్రేమతో దీన్ని ఏర్పాటు చేశారు. కానీ, వ్యవసాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా వారిలో మార్పు రావాలి. నిజానిజాలు బయటకు తీసుకొస్తుంది. జాగ్రత్త ఆఫీసర్స్.
- Advertisement -