హిమాయత్ నగర్ లో సాఫ్ట్ వెర్ కంపెనీలో అగ్నిప్రమాదం

- Advertisement -
A fire broke out in a software company in Himayat Nagar
A fire broke out in a software company in Himayat Nagar

హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని కెడ్సైస్ సాఫ్ట్ వెర్ కంపెనీ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. తెలుగు అకాడమీ ఎదురుగా ఉన్న తిరుమల ఎస్టేట్ లోని రెండవ అంతస్తులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. సర్వర్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో కార్యాలయంలోని కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఉద్యోగులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న సిబ్బంది రెండు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేశారు. బిల్డింగ్ ఐదు అంతస్తులు కావడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీనితో బిల్డింగ్ అద్దాలను అగ్నిమాపక సిబ్బంది ధ్వంసం చేశారు.

A fire broke out in a software company in Himayat Nagar
A fire broke out in a software company in Himayat Nagar
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular