- Advertisement -
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు , బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు గురువారం తెల్లవారుజామున ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం చేసుకుని అధికారులు సోదాలు జరిపారు. పారిజాత తిరుపతి లో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.
బాలాపూర్ గణేష్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి కేఎల్ఆర్ ఇంట్లో కుడా ఐటీ సోదాలు జరిగాయి.
- Advertisement -