Wednesday, March 25, 2026

కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం

- Advertisement -

కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం

A girl was raped by a railway employee in a moving train

             అతన్ని కొట్టి చంపిన ప్రయాణికులు
కాన్పూర్ సెప్టెంబర్ 14
కదులుతున్న రైలులో బాలికపై రైల్వే ఉద్యోగి అత్యాచారం చేయడంతో అతడిని ప్రయాణికులు కొట్టి చంపిన సంఘటన బిహార్ నుంచి ఢిల్లీ వెళ్తున్న హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబం ఢిల్లీకి వెళ్లేందుకు హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్నారు. ఆ కుటుంబం జనరల్ టికెట్లు తీసుకుంది. టిటిఇ అనుమతి ఇవ్వడంతో ఎసి కోచ్-డిలో బాలిక కుటుంబం కూర్చుంది. బాలిక తన తల్లితో కలిసి వాష్‌రూమ్‌కు వెళ్లింది. బాలిక ఒంటరిగా కనిపించడంతో అటెండెంట్ ప్రశాంత్ కుమార్ ఆమెపై అత్యాచారం చేశాడు. బాలిక ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లికి జరిగిన విషయం చెప్పింది. ప్రయాణికులు, ఆ కుటుంబం కలిసి ప్రశాంత్‌పై దాడి చేయడంతో స్పృహ తప్పిపడిపోయాడు. గురువారం తెల్లవారుజామున రైలు కాన్పూర్‌కు చేరుకోగానే జిఆర్‌పి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ప్రశాంత్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్దారించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్