GMA వ్యస్థాపక సభ్యులకు ఘన సన్మానం


గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ మహాసభలు ఘనవిజయం
వర్జీనియాలో అద్భుతంగా సాగిన కార్యక్రమం – నిజాం క్లబ్‌లో ఘన సన్మానం
హైదరాబాద్, వాయిస్ టుడే ప్రతినిధి:
అమెరికా వర్జీనియాలోని లీస్‌బర్గ్ నగరంలో గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) ఆధ్వర్యంలో నిర్వహించిన మొట్టమొదటి మహాసభలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆగస్టు 30, 31 తేదీల్లో రెండు రోజులపాటు ఉత్సాహంగా సాగిన ఈ మహాసభల్లో అమెరికా వ్యాప్తంగా ఉన్న మున్నూరు కాపు కుటుంబాలు పాల్గొని మహాసభలను ఘనవిజయవంతం చేశారు.
ఈ మహాసభలను GMA వ్యవస్థాపక చైర్మన్ ప్రవీణ్ అండపల్లి, కన్వీనర్ రజనీకాంత్ సంగని సమన్వయంతో అద్భుతంగా నిర్వహించారు. మున్నూరు కాపుల సామాజిక, విద్యా, సాంస్కృతిక అభివృద్ధి దిశగా చర్చలు, ఆత్మీయ సమావేశాలు జరిగాయి.
💐 నిజాం క్లబ్‌లో ఘన సన్మానం
మహాసభల అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రవీణ్ అండపల్లి, రజనీకాంత్ సంగనిలకు హైదరాబాద్ నిజాం క్లబ్‌లో ఘన సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమంలో ప్రముఖ మెజిషియన్ సామల వేణు, వాయిస్ టుడే ఎండీ కొత్త లక్ష్మణ్ పటేల్, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, రుద్ర సంతోష్, వామన్ రావు ,మధుసూదన్ ముగ,సదుల వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.
అతిధిగా ఇండియన్–అమెరికన్ రాజు చింతల
ప్రముఖ ఇండియన్–అమెరికన్ ఎంట్రప్రెన్యూర్, అమెరికా రిపబ్లికన్ పార్టీ నేత రాజు చింతల కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సన్మానం అందుకున్నారు.
రాజు చింతల మాట్లాడుతూ —
“భారతదేశంలోని మున్నూరు కాపు సోదరుల ప్రేమ, అనురాగాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.
అమెరికాలో ఉన్న మన తెలుగు వారికీ, మున్నూరు కాపు కుటుంబ సభ్యులకీ ఎల్లప్పుడూ అండగా ఉంటాను.
సమాజ అభివృద్ధి కోసం తగిన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.” అని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రముఖ సామల వేణు, మరియు రుద్ర సంతోష్ మాట్లాడుతూ —
“ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా సంతోషంగా ఉంది. అక్కడ వారు చూపిన ఆతిథ్య సత్కారం, అద్భుతమైన ఎర్పాట్లు మా మనసును తాకాయి. ఎంతో వ్యయ ప్రయాసలు పడి ఈ మహాసభలను విజయవంతం చేసిన GMA సభ్యుల కృషి అభినందనీయమైనది” అని వారు ప్రశంసించారు.
అలాగే బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి మాట్లాడుతూ —
“మున్నూరు కాపుల కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు నా వంతు సహకారం తప్పక అందిస్తాను,” అని ఆయన తెలిపారు.
🌍 సమాజ ఐక్యతకు కొత్త దిశ
ప్రవీణ్ అండపల్లి, రజనీకాంత్ సంగని మాట్లాడుతూ —
“అమెరికాలో నిర్వహించిన మహాసభలు మున్నూరు కాపుల గ్లోబల్ ఐక్యతకు పునాది వేశాయి.
విదేశాల్లో ఉన్న మన సోదరులు మన సంప్రదాయాలను, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.
సమాజ అభివృద్ధి కోసం దేశా మరియు విదేశాల్లోని కులబంధువులతో కలిసి ముందుకు సాగుతాం” అని వారు తెలిపారు.
ఈ సమావేశం ద్వారా GMA గ్లోబల్ స్థాయిలో మున్నూరు కాపుల ఐక్యతకు కొత్త చరిత్ర సృష్టించిందని పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు


