రాష్ట్రంలో హోంమంత్రి ని వెంటనే నియమించాలి

- Advertisement -

రాష్ట్రంలో హోంమంత్రి ని వెంటనే నియమించాలి

A home minister should be appointed in the state immediately

రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆద్వానంగా మారాయి
కేటీఆర్
హైదరాబాద్
ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి రాష్ట్రంలో వెంటనే హోం మంత్రి ని నియమించాలని  బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్  కేటీఆర్ అన్నారు. పోలీసు అధికారులను మా పైనా అశోక్ నగర్ లో పిల్లల పైనా ఉసికొల్పకుండా వారి పని వారు చేసుకునేలా ఫ్రీడమ్ ఇవ్వాలని చెప్పారు. బాగ్ అంబర్ పేట సాయిబాబా నగర్ కాలనీలో జంట హత్యల నేపథ్యంలో బుధవారం కేటీఆర్ ఆ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి  పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పది లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సిటిజన్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి శాంతిభద్రతలను కాపాడా మని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్వయంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వానంగా మారాయని చెప్పారని గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో పట్టపగలు లింగారెడ్డి దంపతుల హత్యను ఇప్పటివరకు పోలీసులు చేదించక పోవడాన్ని తప్పట్టారు. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్, డీజీపీ దృష్టికి తీసుకెళ్తున్నానన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular