- Advertisement -
హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంగళవారం నాడు పద్మారావు నగర్ లో బీఆర్ఎస్ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తరువాత బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో ముందుకు కొనసాగారు. ప్రచారానికి చివరిరోజు కావడంతో భారీ ర్యాలీ మంత్రి నిర్వహించారు. ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ మార్గాల మీదుగా సాగుతూ జెక్ కాలనీలోని గాంధీ విగ్రహం వద్దకు బైక్ ర్యాలీ కొనసాగింది.
- Advertisement -


