బిఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ...
వాయిస్ టుడే వరంగల్ జిల్లా బ్యూరో
___
__వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొండా సురేఖ ని గెలిపించడం లక్ష్యంగా కదులుతున్న నాయకులు….
ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని వరంగల్ తూర్పు కోటకు చెందిన మాజీ AMC డైరెక్టర్ చందర్ మరియు19 వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మోతిలాల్ ఆధ్వర్యంలో 2000మంది, బిఆర్ స్ పార్టీ నుండి, కాంగ్రేస్ పార్టీలోకి మాజీ మంత్రివర్యులు కొండా సురేఖ-కొండా మురళీధర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రేస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు
ఈ సందర్బంగా కొండా సురేఖ, మాట్లాడుతూ వరంగల్ తూర్పులో అభివృద్ధి ఎం జరిగిందో ప్రజలందరూ చూస్తున్నారనిమేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసని అన్నారు. నిరుద్యోగం పెరిగి జీవనోపాధి లేక యువత ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని అధికారం హంగు ఆర్భాటాలే తప్ప సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. వరంగల్ నగరం ఇప్పటినుండి చిన్న వర్షాలకే ముంపుకు గురవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు వరదల సమయంలో మాత్రమే హడావిడి చేయడం ఆ తర్వాత సమస్యను పట్టించుకోలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆరోగ్యారెంటీలతో ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరులో ఉందని అధికారంలోకి రావడం ఖాయం అని కొండ సురేఖ చెప్పడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ నాయకులు మోసపూరిత హామీలకు లొంగకుండా ధైర్యంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది..
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాట్లాడుతూ, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మీకు ఎలాంటి ఆపద సమయంలోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కార్యకర్తలు మా కుటుంబ సభ్యులని చెప్పడం జరిగింది..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు మహిళా నాయకులు కార్యకర్తలు కొండ అభిమానులు పాల్గొన్నారు