Monday, December 23, 2024

ఏ కాంగీ… బెంగాల్ దీదీ… ఢిల్లీ క్రేజీ…. బీహార్ జేడీ….  ఔర్ …  తెలంగాణ కేడీ..  మోడీ కో నహీ రోకేంగే

- Advertisement -
  • a-kangee-bengal-didi-delhi-crazy-bihar-jd-aur-telangana-kd-modi-ko-nahi-rokenge
    a-kangee-bengal-didi-delhi-crazy-bihar-jd-aur-telangana-kd-modi-ko-nahi-rokenge

    బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి…

  • కేసీఆర్…. ఖాసీం చంద్రశేఖర రజ్వీ
  • దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా…..
  • రాహుల్ గాంధీ ఓ గజినీ…..
  • తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం…శిరస్సు వంచి నమస్కరిస్తున్నా
  • సుష్మాస్వరాజ్ కు నా సెల్యూట్
  • చీమల పుట్టలో పాములా చేరిన కేసీఆర్ కుటుంబం
  • కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా సహకరించని కేసీఆర్
  • రైతు సగటు ఆదాయంకంటే సాగుపై కేసీఆర్ కుటుంబ ఆదాయం వందల రెట్ల ఎట్లా పెరిగాయి?
  • ఇదిగో రాజీనామా…. 24 గంటల ఫ్రీ పవర్ పై పార్లమెంట్  బీఆర్ఎస్ ఎంపీలకు బండి సవాల్
  • మణిపూర్ కు పీఎం వెళ్లలేదని అడిగే నైతిక అర్హత మీకుందా?
  • కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం
  • పార్లమెంట్ లో బండి సంజయ్ అద్బుత ప్రసంగం
  • పార్లమెంట్ లో ఆర్ఎస్ఎస్ గొప్పతనాన్ని వివరిస్తూ  సంచలనం స్రుష్టిస్తున్న బండి సంజయ్

భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ సైతం విరుచుకుపడ్డారు. ‘‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫ్లైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. ఇట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం నవ్వొస్తుంది. ఏ కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… సభ్ లోగ్ మిల్ కర్ ఆయే తోబీ మోడీ కో నహీ రోకేంగే…. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్రమోదీ’’అంటూ విరుచుకుపడ్డారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్ ను పూర్తిగా తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు ‘‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా… ఇదిగో నా రాజీనామా… నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’’ అంటూ సవాల్ విసిరారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీపై పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా జరుగుతున్న చర్చపై బీజేపీ పక్షాన బండి సంజయ్ 10 నిమిషాలపాటు మాట్లాడారు. ఈ సందర్భగా కాంగ్రెస్ సహా ఇండియా కూటమితోపాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల తీరుపై విరుచుకుపడ్డారు. సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

రాహుల్ వ్యాఖ్యలు… మోదీని ఏమీ చేయలేరు

అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా వ్యతిరేకిస్తూ మాట్లాడే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. ఈ తీర్మానం ఎందుకు ప్రవేశఫెట్టారో వారికే తెలియదు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నాయకుడి వ్యవహారశైలి చూసి ప్రపంచమంతా నవ్వుతోంది. ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెల్వదు.. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించకుంటడు.. ఇంకోసారి ఫైయింగ్ కిస్ ఇస్తడు.. గజినీ లెక్క తయారైండు.. గిట్లాంటాయనతో కలిసి అవకాశవాద కూటమి  అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ భారతమాతను హత్య చేశారంటూ కించపర్చారు. భారత మాతవైపు కన్నెత్తి చూస్త్తే కళ్లు పీకే ఆదర్శ నేత మోదీ. వీళ్లంతా ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన నాయకులు…  యే కాంగీ… బెంగాల్ దీదీ…ఢిల్లీ క్రేజీ….బీహార్ జేడీ…. ఔర్ ఔర్… తెలంగాణ కేడీ… వీళ్లతో మోదీ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు.. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోంది.

a-kangee-bengal-didi-delhi-crazy-bihar-jd-aur-telangana-kd-modi-ko-nahi-rokenge
a-kangee-bengal-didi-delhi-crazy-bihar-jd-aur-telangana-kd-modi-ko-nahi-rokenge

తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…సుష్మాకు సెల్యూట్…

ఈ పవిత్రమైన పార్లమెంట్ కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా…. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల 1400 మంది యువకులు బలయ్యారు. జై తెలంగాణ అంటూ రివాల్వర్ తో కాల్చుకున్నరు. ట్రైన్ కు ఎదురుగా పోయి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సభ వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే ఇచ్చారు.. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహానేత. చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుండి అనుకూలం. తెలంగాణకు అనుకూలంగా కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్