- Advertisement -
అమరావతి:
A key decision of the state government on constructions in the capital
రాజధానిలో నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న నిర్మాణాల పటిష్టతపై అధ్యయనం చేయాలని ఆదేశించింది. ఏఐఎస్‌లు, ఎన్జీవోల సముదాయాలు, సచివాలయాల ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాల బేస్‌మెంట్‌లపై అధ్యయనం చేయనున్నారు. రాజధాని నిర్మాణాల స్థితిగతులపై శుక్రవారం సాయంత్రం మంత్రి నారాయణ అధికారులతో సమీక్షించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణ బాధ్యతలు ఐఐటీ చెన్నైకి అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఐఐటీ చెన్నై, ఐఐటీ హైదరాబాద్ సంస్థలకు ప్రభుత్వం లేఖలు రాయనుంది.
- Advertisement -