Tuesday, January 14, 2025

కేటీఆర్ మెడపై వేళాడుతున్న కత్తి

- Advertisement -

కేటీఆర్ మెడపై వేళాడుతున్న కత్తి

A knife hanging on KTR's neck

హైదరాబాద్, డిసెంబర్ 18, (వాయిస్ టుడే)
ఎముకలు కొరికే చలిలో.. తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తెలంగాణ రాజకీయం అతి త్వరలో ఊహించని మలుపు తిరిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు కారణం.. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం. ఈ కేసులో కేటీఆర్‌ను విచారించి, అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో కేటీఆర్‌ను తెలంగాణ ఏసీబీ ప్రశ్నించి అరెస్టు చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేతలు పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా.. కేటీఆర్‌పై కేసు నమోదు చేయడానికి గవర్నర్ అనుమతి ఇచ్చారని.. అతి త్వరలోనే దీనిపై సీఎస్ నుంచి అధికారిక ఆదేశాలు ఏసీబీకి వెళ్తాయని అంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.
1.ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ అనుమతిని ఏసీబీకి పంపాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో కేసు నమోదు, విచారణ వేగవంతం అయ్యే అవకాశం ఉంది.
2.ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి.. అనుమతి లేకుండానే హెచ్‌ఎండీఏ ఒప్పందం చేసుకోవడం, ఆర్‌బీఐ అనుమతి లేకుండా రూ.46 కోట్ల మేర విదేశీ కరెన్సీ చెల్లించడంతో పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసింది.
3.డబ్బుల చెల్లింపు, కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌, అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ పైన ఆరోపణలు ఉన్నాయి.
4.కేటీఆర్ మినహా.. మిగతా అధికారులపై విచారణకు ప్రభుత్వం గతంలోనే అనుమతి ఇచ్చింది. కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్‌ నుంచి అనుమతి కోరగా.. తాజాగా అనుమతి లభించింది.
5.కేటీఆర్‌పై కేసు నమోదుకు సంబంధించి అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకుని గవర్నర్‌ అనుమతి ఇచ్చారని సమాచారం. ఇదే విషయాన్ని మంత్రులకు రేవంత్ రెడ్డి చెప్పినట్టు తెలిసింది.
6.కేటీఆర్‌పై కేసు నమోదు అంశంపై చర్చ సందర్భంగా.. కీలక విషయాలు తెరపైకి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కేటీఆర్‌ను అరెస్టు చేస్తే.. రాజకీయంగా నష్టమా.. లాభమా అనే చర్చ జరిగినట్టు సమాచారం.
7.కేటీఆర్‌పై కేసు, అరెస్టు వార్తల నేపథ్యంలో.. బీఆర్ఎస్ అలర్ట్ అయ్యింది. ఒకవేళ కాంగ్రెస్ నేతలు చెప్పేదే జరిగితే.. ఎలా ముందుకెళ్లాలని కారు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
8.కేసు, అరెస్టు కామెంట్స్‌పై కేటీఆర్ ఇటీవల స్పందించారు. తాను దేనికైనా సిద్ధంగా ఉన్నానని, కేసులకు భయపడబోనని స్పష్టం చేశారు. కార్ రేసుకు సంబంధించి పూర్తి బాధ్యత తనదేనని, అధికారుల పాత్ర లేదని చెప్పారు.
9.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేటీఆర్‌ను టార్గెట్ చేశారని, రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.కేటీఆర్‌ను జైలుకు పంపడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తోందని ఆరోపిస్తోంది.
10.కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు కేటీఆర్‌పై కేసు నమోదు, అరెస్టు వంటి పరిణామాలను వ్యతిరేకిస్తున్న తెలిసింది. ఇష్యూ ఏదైనా.. కేటీఆర్‌ను అరెస్టు చేస్తే.. సింపతి మైలేజ్ బీఆర్ఎస్ పార్టీకి వెళ్తుందని, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవని.. హస్తం పార్టీ ఎమ్మెల్యే ఒకరు చెప్పారు.
త ర్యాలీ, మీటింగ్ అక్కడే తొలుత పెట్టారు. నాటి తెలంగాణ తల్లి విగ్రహానికి అక్కడే శంకుస్థాపన చేశారామె. మండలిలో ఆ నియోజకవర్గం నుంచే ప్రధానంగా మాట్లాడుతున్నారట. మొత్తానికి అన్నీ పనులు అక్కడి నుంచే మొదలుపెడుతున్నారట కవిత.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్