ఇంటర్వెల్ ముందే ప్రేమ కథ… కామెడీ కూడా!
హైదరాబాద్, మార్చి 25
A love story before the interval... a comedy too!
నితిన్, శ్రీ లీల జంటగా నటించిన తాజా సినిమా ‘రాబిన్ హుడ్’. ఈ శుక్రవారం (మార్చి 28న) థియేటర్లలోకి వస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ చేసిన సినిమా ఇదే. నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల పోషించారు. ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుందీ సినిమా. దాంతో పాటు ఫస్ట్ రివ్యూ కూడా బయటకు వచ్చేసింది. మరి సినిమా టాక్ ఎలా ఉందో తెలుసుకోండి.సాధారణంగా హీరో హీరోయిన్లతో పాటు ప్రధాన పాత్రలను సినిమా ప్రారంభంలో పరిచయం చేస్తారు. ‘రాబిన్ హుడ్’ సినిమాలో కూడా నితిన్, శ్రీ లీలతో పాటు రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ తదితర ప్రధాన తారాగణం అంతటినీ ఇంటర్వెల్ ముందే దర్శకుడు వెంకీ కుడుముల పరిచయం చేశారని తెలిసింది. హీరో హీరోయిన్ల ప్రేమ కథ చాలా బాగా వచ్చిందట. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ చేసిన కామెడీ ఆడియన్స్ అందరినీ నవ్విస్తుందని చెబుతున్నారు.మెయిన్ ఆర్టిస్టులు అందరినీ ముందుగానే పరిచయం చేసినప్పటికీ… డేవిడ్ వార్నర్ మామను మాత్రం క్లైమాక్స్ వరకు దాచేశారు. ఆయన రోల్ మాత్రం ఎండింగ్ లో అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని తెలిసింది. విశ్రాంతికి ముందు వరకు ప్రేక్షకులకు వినోదం అందించిన వెంకీ కుడుముల… ఇంటర్వెల్ తర్వాత అసలు కథను రివీల్ చేశారట. ఈ సినిమాలో ఎమోషనల్ యాంగిల్ ఎప్పటి వరకు బయటకు తీయలేదని, అది ఆడియన్స్ అందరినీ ఒక సర్ప్రైజ్ అండ్ షాక్ కి గురి చేస్తుందని చెబుతున్నారు.ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే ఒక భావోద్వేగ భరిత సన్నివేశం విశ్రాంతి తర్వాత వస్తుందని సినిమా చూసిన జనాలు తెలిపారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తే ఇదొక కామెడీ సినిమా అనిపిస్తుంది. కామెడీని మించిన ఎమోషన్ సినిమాలో ఉందని టాక్. ట్రైలర్ జాగ్రత్తగా గమనిస్తే… అందులో ‘రాబిన్ హుడ్’ పాత్ర చేశారు హీరో నితిన్. ఆయన దొంగతనాలు చేయడం, ధనవంతులను దోచుకోవడం కనిపించింది. కానీ ఎందుకు దోచుకుంటున్నారు? ఆ దోచిన డబ్బును తిరిగి ఎవరికి పంచుతున్నారు? ఏమిటి? అనేది మాత్రం వెంకీ కుడుమల చూపించలేదు. ఆ పాయింట్ మెయిన్ అనేది టాక్. నితిన్ మీద ఇంటర్వెల్ తర్వాత తీసిన ఒక స్టైలిష్ ఫైట్ కూడా ఆడియన్స్ అందరికీ నచ్చడం గ్యారెంటీ అంటున్నారు.రాబిన్ హుడ్’ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. ఆయన ఇచ్చిన పాటలు సిల్వర్ స్క్రీన్ మీద బాగా వచ్చాయట. రీ రికార్డింగ్ విషయంలో కూడా బాగా చేశారని టాక్. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఖర్చు విషయంలో అస్సలు వెనకాడకుండా భారీ ఎత్తున సినిమాను తీసిందట. కేతిక శర్మ చేసిన స్పెషల్ సాంగ్ ‘అదిదా సర్ప్రైజ్’ సినిమాకు కావాల్సిన బజ్ తీసుకొచ్చింది. మార్చి 28న సినిమా ఫైనల్ రిజల్ట్ తెలుస్తుంది.