- Advertisement -
చికెన్ కర్రీ గిన్నెలో పడి వ్యక్తి మృతి
May 08, 2024,
చికెన్ కర్రీ గిన్నెలో పడి వ్యక్తి మృతి
తెలంగాణలో ఓ విషాద ఘటన చోటుచేసుకుంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఓ వ్యక్తి చికెన్ కర్రీ గిన్నెలో పడి మృతి చెందాడు. ధరూర్ మండలం కుక్కింద్ గ్రామానికి చెందిన మల్లేశం అనే వ్యక్తి ధరూర్ మండల కేంద్రంలో జరుగుతున్న బీఆర్‌ఎస్ మీటింగ్‌కు వచ్చాడు. మే 2న మల్లేశం అదుపుతప్పి చికెన్ కర్రీ గిన్నెలో పడిపోయాడు. వెంటనే అతడిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు.
- Advertisement -