హక్కుల సాధన కోసం లక్ష డప్పులు, వెయ్యి గొంతులతో కవాతు
A march with a thousand drums and a thousand voices for the pursuit of rights
-ప్రజా గాయకుడు రామంచ భరత్
పెద్దపల్లి ప్రతినిధి:
ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎమ్మార్పీఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడు తున్నారని, వారు చేపట్టిన కవాతుకు మద్దతుగా మాదిగలంతా సహకరించాలని ప్రజా గాయకుడు రామంచ భరత్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశాన్ని మంగళవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజా కళా నాయకుడు రామంచ భరత్ మాట్లాడుతూ దేశంలో అన్ని వర్గాల ప్రజలు వర్గీకరణకు మద్దతు తెలిపాయన్నారు. ఎస్సీలలో ఉన్న 59 కులాల్లో కేవలం ఒక కులం మాత్రమే వ్యతిరేకంగా ఉందని అన్నారు. అన్ని ఉద్యమాల్లో, రాజకీయ పార్టీల గెలుపు ఓటములలో మాదిగ కళాకారుల పాత్ర ఉందని అన్నారు. ఎన్నో మంచి చెడులలో, ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పులు కొట్టబోతున్నామ న్నారు. ఈనెల 27 నుంచి జనవరి 27 వరకు లక్ష డప్పులు వెయ్యి గొంతుల కళానాయకుల కవాతు కార్యక్రమాన్ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించను న్నారని తెలిపారు. ఎమ్మెస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాట్లాడుతూ ఈ కవాతు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, మాదిగ మేధావులు, ఉద్యోగులైన జాతి బిడ్డలను గౌరవించుకుంటూ వారిని సన్మానం చేస్తామని అన్నారు. అలాగే అమరులైన మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తానని హామీ ఇవ్వడంతో బలమైన ఆకాంక్షను తెలియజేసేందుకు మొదటిసారి తమ హక్కుల కోసం డప్పు కొట్టబోతున్నట్లు తెలిపారు. అందుకోసం ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిధిలోని మాదిగలు, మాదిగ ఉపకులాల కళానాయకు లంతా విధిగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గుండా థామస్, మహా ప్రదర్శన రాష్ట్ర కోఆర్డినేటర్ ముక్కెర సంపత్ కుమార్, ఏంఎస్ పీ జిల్లా అధ్యక్షులు మంథని చందు, రాష్ట్ర నాయకులు అంబాల రాజేందర్, వడ్డేపల్లి బాలన్న డప్పు కళాబృందాల పెద్దపెల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి, మడిపల్లి దశరథం, జిల్లా ప్రధాన కార్యదర్శి,కన్నూరి అంజు ప్రజా గాయకుడు, ఏట రవన్న ప్రజా గాయకుడు, గాజుల రమేష్ గోదావరి కళా సంఘాల జాయింట్ సెక్రెటరీ, అగ్గిమల్ల కొమురయ్య డప్పు కళా సంఘాల నాయకులు, ప్రజా గాయకులు, తూండ్ల రాజన్న, సిరిసిల్ల శంకర్ మాదిగ, బర్ల తిరుపతి, వడ్లకొండ రవి వర్మ, కొండ్ర సునీత, ఏట మమత, ఎమ్మార్పీఎస్ అధికార ప్రతినిధి పొట్ల రమేష్, మామిడి విష్ణు, అక్కపాక మహేష్, ఏట సంపత్ మాదిగ, డప్పు కళాకారుడు గడ్డం రామచంద్రం, దూడపాక సతీష్, ఆది జాంబవుని డప్పు కళాబృందం నాయకులు , చిలుముల వెంకటస్వామి ఆది జాంబవంతుని డప్పు కళాబృందం అధ్యక్షులు, తదితరులు ఉన్నారు.]