ఎన్నికలకు దూరంగా కోటి మంది
హైదరాబాద్, మే 15
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓటింగ్ శాతం నమోదు అయింది. ఎన్నికల సరళి పై పూర్తిస్థాయి కసరత్తు చేసిన ఎలక్షన్ కమిషన్ తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 17 లోక్ సభ స్థానాలకుగాను 65.67% నమోదయింది అయితే 2019 లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే మూడు శాతం అధికంగా నమోదు అయినట్లు ప్రకటించింది ఎలక్షన్ కమిషన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల 32 లక్షల 16 వేల మంది ఓటర్లు ఉంటే.. ఎన్నికల్లో రెండు కోట్ల 20 లక్షల 24 వేల మంది పాల్గొన్నట్లు తెలిపారు. ఈ ఓటింగ్ శాతమే 66.3 గా నమోదు అయిందని పేర్కొన్నారు.రెండు కోట్ల 20 లక్షల 24 వేల ఓటర్లలో రెండు కోట్ల 18 లక్షల 14 వేల మంది 35వేల పోలింగ్ కేంద్రాలలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, మిగిలిన రెండు లక్షల పదివేల మంది పోస్టల్ బ్యాలెట్ హోం వోటింగ్ ద్వారా వినియోగించుకున్నారని వివరించింది. ఈ రెండు లక్షల పదివేల మందిలో 1,89,000 మంది ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాగా, 21,680 మంది వృద్ధులు హోమ్ ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు ఎన్నికల అధికారులు. అత్యధికంగా భువనగిరి పార్లమెంటు స్థానంలో 76.78 శాతం నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో 48.48 నమోదు అయింది.
ఎన్నికలకు దూరంగా కోటి మంది
- Advertisement -
- Advertisement -