- Advertisement -
సవ్యంగా జరగని మున్సిపాలిటీ విస్తీర్ణ ప్రక్రియ…పెద్ది
A misguided municipality expansion process...Peddi
నర్సంపేట:
నర్సంపేట మున్సిపాలిటీ విస్తీర్ణం, గ్రామాల విలీనప్రక్రియ లోపా బూయిస్టాంగా జరిగిందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించాడు. మంగళవారం నర్సంపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్ది మాట్లాడుతూ,నర్సంపేట రూరల్ మండలం ఎంపీటీసీల డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా విరుద్దంగా ఉందని,నిబంధనలను తుంగలో తొక్కి స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం మేరకే అధికారులు వ్యవహారిస్తున్నారని అన్నాడు.ప్రజల భాగస్వామ్యం గానీ, ప్రతిపక్ష పార్టీలతో నిర్వహించిన సమావేశంలో తీసుకున్నా నిర్ణయాలు బుట్టదాఖలు చేశారని విమర్శించాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి సమస్యలపై జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళితే ప్రభుత్వ నిర్ణయమని చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాత ముగ్ధంపురం గ్రామ పంచాయతీ ప్రజల కోరిక మేరకే ప్రత్యేక గెజిట్ ద్వారా జీవో విడుదల చేసి చెన్నారావుపేట లో విలీనం చేయడం జరిగిందన్నారు.ప్రజా పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు గతంలోనే చెన్నారావుపేటలో అంతర్లీనమైన పాత ముగ్ధుంపురం గ్రామాన్ని చెన్నారావుపేట రూరల్ మండలానికి కలిపి గురజాల ఎంపీటీసీ పరిధిలోకి తీసుకురావడం అనేది ప్రజలకు పూర్తిగా అన్యాయం చేయడమే అన్నాడు.రాజుపేట గ్రామాన్ని కలుపుతున్నామంటూ మొదట గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి,మళ్లీ తప్పుచేశమని చెంపలు వేసుకొని రాజుపేట గ్రామ విలీనం రద్దు చేస్తున్నామంటూ మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయడం ఏంటని ప్రశ్నించ్చాడు.రాజుపేట గ్రామ శివారు దాటి కిలోమీటర్ దూరంలో ముత్తూజిపేట గ్రామం ఉన్నదని,ముతోజిపేట గ్రామాన్ని విలీనం చేస్తున్నామంటూ నోటిఫికేషన్ విడుదల చేస్తూ మ్యాపింగ్ చేసారు.నర్సంపేట నుంచి ముతోజిపేటకు రవాణా మార్గం ఎట్లా ఉన్నదో స్థానిక ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. ప్రజల అభిప్రాయం,గ్రామసభలు నిర్వహించకుండ ప్రజలు రేషన్ షాప్ కు వెళ్లి పెట్టిన సంతకాలు సేకరించిన గ్రామ సభలు జరిగి నట్లు,ప్రజలు ఆమోదం పలికినట్లు రికార్డులు సృష్టించి ఈ విలీనానికి కాంగ్రెస్ ప్రభుత్వం పాలుపడ్డదని అన్నాడు.నర్సంపేట మున్సిపాలిటీ విస్తరించాలని మున్సిపాలిటీ ప్రజలు ఎవరైనా అడిగారా అంటూ ప్రశ్నించ్చాడు.మున్సిపాలిటీలో విలీనమైన గ్రామ ప్రజలు ఏనాడు ఎమ్మెల్యేను కలిసి మున్సిపాలిటీలో విలీనం చేయాలని కోరలేదన్నారు.ఉపాధి హామీ పథకం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారని అన్నాడు. గ్రామాలు విలీనంకావడం వల్ల నిధులు ఎక్కువగా వస్తాయి అని దుష్ప్రచారం చేశారుని. పైన ముఖ్యమంత్రికి,ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కు అసలే పడదని నిధులు ఎలా వస్తాయో చెప్పాలన్నాడు.ఇది ప్రజా పాలనలా లేదని పిచ్చోళ్ళ పాలనలాగా ఉందంన్నాడు.కేవలం విలీన గ్రామాల పరిధిలో ఉన్న వేలాది ఎకరాల అసైన్మెంట్ ఇతర భూముల పై ముఠాల కన్ను పడింది కాబట్టే ఈ గ్రామాల విలీనం చేశారని విమర్శించాడు.ఇంత పెద్ద ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఒక్కసారైనా స్థానిక ఎమ్మెల్యే,మున్సిపల్ అడ్మిషన్ అధికారులతో ,రెవెన్యూ అధికారులతో ,పంచాయతీరాజ్ అధికారులు కలిసి సమీక్ష జరిపారని ప్రశ్నించారు.రూరల్ మండలంలో ఏడు ఎంపీటీసీలను ఏ ప్రతిపాదన కింద డీలిమిటేషన్ చేశారో జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు బాధ్యత వహించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, మండలపార్టి అధ్యక్షులు,బి ఆర్ టీ యు జిల్లా అధ్యక్షుడు,మాజీ ఎంపీపీ,జడ్పీటీసీ,మండల ప్రధాన కార్యదర్శి,మాజీ కౌన్సిలర్స్,మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు,క్లస్టర్ బాధ్యులు పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -