Saturday, February 14, 2026

మూగబోయిన ఉద్యమ గళం

- Advertisement -

విప్లవ జోహార్

బిఎల్ ఎఫ్ రాష్ట్ర నాయకులు యస్, సిద్దిరాములు..

కామారెడ్డి బ్యూరో, ఆగస్టు 6 (వాయిస్ టుడే): ప్రజా గయకుడు గద్దర్ కన్నుమూత ప్రజానీకానికి తీరని లోటని బిఎల్ఎఫ్ రాష్ట్ర నాయకులు ఎస్ సిద్ధిరాములు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ

ప్రజ యుద్ద నౌక కామ్రేడ్ గద్దర్ తో తనకు ముడు దశాబ్దాల పరిచయం ఉందని  అన్నారు.

గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు.

గుండెపోటుతో కొద్దిరోజుల కిందట అమీర్‌పేటలోని అపోలో స్పెక్ట్రా హాస్పిటల్‌లో చేరిన గద్దర్‌ అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సహా పలువురు ప్రముఖులు ఆయన్ను పరామర్శించారు.

ఈనెల 3న వైద్యులు గద్దర్‌కు బైపాస్‌ సర్జరీ చేయగా, కోలుకున్నట్లు కనిపించారు. అయితే, ఊపిరితిత్తులు, యురినరీ సమస్యలతో గద్దర్‌ బాధపడుతుండటంతో ఆదివారం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించగా, కొద్దిసేపటికే కన్నుమూశారు.

గద్దర్‌ మరణంతో సికింద్రాబాద్‌ భూదేవి నగర్‌లోని ఆయన నివాసం వద్దకు బంధువులు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో భూదేవి నగర్‌లో విషాద ఛాయలు స్పష్టంగా కనిపించాయన్నారు.

అమర్ రహే గద్దరన్న.. నీ పాట అజరామరం

ప్రజా యుద్ధనౌకగా పేరొందిన గద్దర్‌.. పీపుల్స్‌ వార్‌, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో తన గళంతో కోట్ల మంది ప్రజలను ఉత్తేజపరిచారని పేర్కొన్నారు.

గద్దర్‌ 1949 లో తూప్రాన్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్‌ రావ్‌. నిజామాబాద్‌, హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన 1975 లో కెనరా బ్యాంకులో ఉద్యోగం చేశారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు పిల్లలు (సూర్యుడు, చంద్రుడు, వెన్నెల). జన నాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు.

ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరినీ ఉత్తేజ పరిచేవారు. మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమానికి ఊపుతెచ్చారు.

1987లో కారంచేడు దళితుల హత్యలపై గద్దర్‌ అవిశ్రాంతంగా పోరాటం చేశారు. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ క్రమంలోనే 1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం కూడా జరిగిందన్నారు.

అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద వంటి పాటలు ఉద్యమాలకు మరింత ఊపుతెచ్చాయి. మాభూమి  సినిమాలో వెండితెరపై కనిపించిన గద్దర్‌ ఆయనకు  నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా.. పాటకు నంది అవార్డు లభించింది.  ఆ అవార్డును ఆయన తిరస్కరించారు అన్నారు.

తెలంగాణ లో బహుజన ఉద్యమం కు ,బిఎల్ ఎఫ్ కు అవిర్భవంకు తన కృషి ఎంతో ఉందనీ, కామ్రేడ్ గద్దర్ కు విప్లవ జోహార్ అర్పిస్తున్నామన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్