Monday, March 24, 2025

అంతు పట్టని  జగన్ స్ట్రాటజీ

- Advertisement -

అంతు పట్టని  జగన్ స్ట్రాటజీ
విజయవాడ, ఫిబ్రవరి 27, (వాయిస్ టుడే)

అనర్హత భయమే వైసీపీని అసెంబ్లీకి తీసుకొచ్చిందా.. అందుకే ఒక్కరోజు సమావేశాలకు మాత్రమే పరిమితం అయ్యారా.. అదే నిజం అయితే మళ్లీ ప్రతిపక్ష హోదా నినాదం ఎందుకు.. అసెంబ్లీలో జగన్ ఎపిసోడ్‌పై జరుగుతున్న చర్చ ఏంటి?కూటమి అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపాయ్ ఈసారి అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని.. లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పిన జగన్‌.. బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడమే దీనికి కారణం. సభకు వచ్చిన జగన్.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఆందోళనకు దిగారు.పోడియం ఎదుట.. ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరసనలు చేసిన తర్వాత.. ప్రభుత్వం తీరు, గవర్నర్ స్పీచ్‎కు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. సభకు వచ్చినట్లే వచ్చిన జగన్.. 20 నిమిషాల్లోనే పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేయటం కొత్త చర్చకు కారణం అయింది. జగన్ అలా వచ్చి ఇలా వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అవుతోంది. భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారంటూ అధికార పార్టీ నేతలు ఓ రేంజ్‌లో టార్గెట్ చేస్తున్నారు.నిజానికి అసెంబ్లీకి వైసీపీ హాజరుపై.. కొంతకాలంగా భారీ మాటల యుద్ధం జరుగుతోంది. స్పీకర్ చైర్‌లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉండగా.. జగన్‌ను సభలో కూర్చొబెట్టాలని అధికార ఆశపడుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేగాని సభకు రానంటూ జగన్‌ డిమాండ్ చేస్తున్నారు.దీంతో అధికార పార్టీ సరికొత్త అస్త్రాన్ని తెరమీదకు తీసుకవచ్చింది. 60 రోజులు సభకు రాకపోతే.. చట్టప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని స్పీకర్‌ అయ్యన్నతో పాటు.. డిప్యూటీ స్పీకర్ రఘురామ  వార్నింగ్ ఇచ్చారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత ప్రమాదం నుంచి బయటపడాలంటే.. సభకు వచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు.దీంతో రాజకీయం రసవత్తరంగా కనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరై.. ప్రతిపక్ష హోదా నినాదం వినిపించి వెళ్లిపోయారు. జగన్ తీరుపై ఇప్పుడు అధికార పార్టీ మాటల యుద్ధం మొదలుపెట్టింది. 60రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం కోల్పోతామనే భయంతోనే.. జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారంటూ టార్గెట్ చేస్తున్నారు.ప్రజాసమస్యల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా అడగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లలో ప్రతిపక్ష హోదా రాదని వైసీపీ నేతలు ఫిక్స్ అయితే బెటర్ అంటూ పవన్‌ కల్యాణ్ సెటైర్లు వేశారు. ఓవరాల్‌గా జగన్‌ రాక.. ఇప్పుడు ఏపీ రాజకీయాలను మరింత ఇంట్రస్టింగ్‌గా మార్చింది. ఇక అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన తర్వాత.. పార్టీ నేతలతో తాడేపల్లిలో భేటీ అయిన జగన్.. ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని.. అసెంబ్లీకి వెళ్లడం కంటే.. జనాల్లోకి వెళ్లి పోరాడడం బెటర్ అని నేతలకు సూచించారు.అసెంబ్లీలో సంతకాలు చేసి.. అనర్హత పడకుండా వైసీపీ నేతలు జాగ్రత్త పడ్డారని.. ఇదంతా భయమే అని అధికార పార్టీ నేతలు వైసీపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ భయంతోనే ఒక్కరోజు సమావేశాలకు మాత్రమే పరిమితం అయ్యారని.. ఇకపై హాజరుకానని చెప్పేది అందుకే అంటున్నారు.ఏమైనా ఏపీ అసెంబ్లీ రూల్స్‌ చుట్టూ తిరిగిందీ రెండు రోజులు. 60రోజులు వరుసగా హాజరుకాకపోతే రూల్స్ ప్రకారం సభ్యత్వం రద్దవుతుందని వైసీపీని అధికార పార్టీ సభకు రప్పిస్తే.. ఒక్కరోజు అలా వచ్చి సంతకాలు చేసి.. ఇక రామని చెప్పి అదే రూల్స్‌ను ఆయుధంగా వాడుకుంది వైసీపీ అనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. సభకు వచ్చినట్లే వచ్చి.. వాకౌట్ చేసి జగన్‌ తన స్ట్రాటజీ ఏంటూ ప్రూవ్ చేసుకున్నారన్నది మరికొందరి అభిప్రాయం. అసెంబ్లీ సమావేశాలు మరీ ఇంత ఆసక్తిగా ఉంటాయని అనుకోలేదంటూ చర్చ మొదలుపెట్టారు.. ఈ వ్యవహారం అంతా చూసినవాళ్లు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్