జీవో బాధిత టీచర్లకు శాశ్వత పరిష్కారం చూపించాలి
A permanent solution should be shown to the bio affected teachers
పిఆర్టీయూ టిఎస్ డైరీ ఆవిష్కరణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల,
317 జీవో ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు శాశ్వత పరిష్కారం చూపించాలని,కేవలం స్పౌజ్ ఉపాధ్యాయులకు మాత్రమే కాకుండా బాధిత ఉపాధ్యాయులందరికీ న్యాయం చేయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కరీంనగర్ పట్టభధ్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ఇందిరాభవన్ లో
పిఆర్టీయూ టిఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు, యాళ్ళ అమర్నాథ్ రెడ్డిల అధ్యక్షతన జరిగిన పిఆర్టీయూ టిఎస్ 2025 డైరీని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పాత పది జిల్లాలను జోన్లుగా మారుస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు మార్పు కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు.
2004 కు ముందు ఉద్యోగ ఉపాధ్యాయుల నియమాకాలకు నోటిఫికేషన్ వెలువడి 2004 తర్వాత నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ అమలు చేయాలని ఆయన సూచించారు ..దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం పడదన్నారు.రెండవ పిఆర్సీ కమిటీ త్వరలోనే నివేదిక ప్రభుత్వానికి అందజేస్తుందని,నివేదిక ఇచ్చిన వెంటనే కొత్త పిఆర్సీని అమలు చేయడం జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 25 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వచ్చాయని, పది వేల కొత్త ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయని జీవన్ రెడ్డి తెలిపారు.
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే ప్రధాన పాత్ర అని చెబుతూ ప్రాథమిక హక్కుల్లో భాగమైనటువంటి విద్యా సదుపాయాల కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధాన బాధ్యత వహించి నిరుపేద వర్గ కుటుంబాలకు అండగా నిలిచి విద్యా బోధనపై దృష్టి కేంద్రీ కరించవలసిన అవసరం ఉందన్నారు ..ప్రాథమిక హక్కులు భాగమైనటువంటి విద్యను దృష్టిలో ఉంచుకొని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విద్యహక్కు చట్టాన్ని ప్రవేశపెట్టారని జీవన్ రెడ్డి అన్నారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్,పిఆర్టీయూ టిఎస్ నాయకులు రవికుమార్, గోవర్ధన్,ప్రసాద్, మహేష్, శ్రీనివాస్ రెడ్డి,తోట రాజేష్, దుబ్బయ్య,భాస్కర్ రెడ్డి,చంద్రశేఖర్ రెడ్డి,రాజగోపాల్, మల్లారెడ్డి,రాజేందర్ రెడ్డి,రవీందర్, వసంతరావు,కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు