- Advertisement -
అనుమానాస్పస్థితిలో వ్యక్తి మృతి
A person died under suspicious circumstances
పుట్టపర్తి
కొత్తచెరువు తహసిల్దార్ కార్యాలయం సమీపంలో అనుమానాస్పస్థితిలో వ్యక్తి మృతి చెందాడు. – వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వద్ద ఉన్న ఆధారాల ప్రకారం మండలంలోని మీర్జాపురం గ్రామానికి చెందిన గంగాద్రి ( 40 )గా గుర్తించి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు రోజుల కిందట మృతి చెంది ఉంటాడని పోలీసుల అనుమానిస్తున్నారు. మృతుని తలపై గాయాలు ఉండడంతో కర్రలతో కొట్టి హత్య చేసి పడేసి వెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకి గల కారణాలపై భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
- Advertisement -



