నవీపేట్: సొంత గ్రామం పొతంగల్ లో బిఆర్ఎస్ ఎంపీటీసీని గెలిపించుకోలేని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే షకీల్ ను గెలిపిస్తుందా అని బీజేపీ అభ్యర్ది వడ్డీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మండలంలోని పోతంగల్, శివతాండ, మట్టయ్య ఫారం, అబ్బాపూర్ తాండ, అబ్బపూర్ (బి), మద్దేపల్లి కోస్లి గ్రామాలలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత సొంత గ్రామం పొతంగల్ లో బిజెపి ఎంపీటీసీ గెలిచాడని విమర్శించారు. గెలిచిన బిజెపి ఎంపీటీసీని పరువు కోసం కొనుక్కొని బిఆర్ఎస్ లో చేర్పించుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కూతురైన కవిత సొంత గ్రామాభివృద్ధి చేయలేదని అన్నారు. బిజెపి మేనిఫెస్టో తో బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల దిమ్మదిరిగి పోయిందని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమం బిజెపి తోటే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడిపాటి ప్రకాష్ రెడ్డి, అడ్డూరి శ్రీనివాస్, బందెల ఆనంద్, రమణారావు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
సొంత గ్రామాన్ని అభివృద్ది చేయని కవిత
Published By Voice Today Team
135
- Advertisement -
- Advertisement -
- Tags
- bjp
- bjp live
- bjp releases telangana election manifesto
- telangana
- telangana 2023 elections
- telangana assembly elections
- telangana assembly elections 2023
- telangana bjp
- telangana bjp manifesto
- telangana bjp mla candidates first list
- telangana congress manifesto
- telangana election
- telangana election 2023
- telangana election survey 2023
- Telangana elections
- telangana elections 2023
- telangana news
- telangana politics
- who is winning telangana election



