Thursday, December 12, 2024

జోష్ నింపిన ప్రజా ఆశీర్వాద సభ

- Advertisement -

భారీగా తరలివచ్చిన జనం
కెసిఆర్ సభ సక్సెస్ పట్ల  నాయకుల హర్షం
ఇక ప్రచార భారమంతా ఎమ్మెల్యే దాసరి పైనే….

పెద్దపల్లి: అంతా అనుకున్నట్లుగానే ప్రజా ఆశీర్వాద సభ విజయవంతం కావడం పట్ల ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పెద్దపెల్లి టిఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఎక్కడ తగ్గకుండా జన సమీకరణలో భారీగా సక్సెస్ సాధించారని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ జోష్ ఇలాగే కొనసాగితే టిఆర్ఎస్ కారు గుర్తుకు ఓటు పడటం ఖాయంగా కనిపిస్తున్నది. దాసరి మనోహర్ రెడ్డి మరోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ప్రజలు ప్రజల ముందు నిలబడనున్నారు. అయితే కెసిఆర్ సభలో తెలిపిన అంశాలను పక్కన పెడితే ప్రస్తుత రెండున్నర ఏళ్లలో ప్రజల్లో టిఆర్ఎస్ పార్టీపై చాలా వ్యతిరేకత కనిపిస్తున్నది. నిరుద్యోగ సమస్య, యువతకు ఉపాధి, నోటిఫికేషన్ల పేరుతో కాలయాపన టిఎస్సీపిఎస్సిలో జరిగిన అవినీతి అక్రమాలు, ఎన్నికల పేరుతో నోటిఫికేషన్ రద్దు అంశాలు ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీపై, బిఆర్ఎస్ ప్రభుత్వంపై పడనున్నదని  పలువురు పేర్కొంటున్నారు. ఇక మరో విషయానికి వస్తే ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పై ఆయన పార్టీ వర్గీయులే తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ఓటర్ల విషయం పక్కన పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ బలం కొంత తగ్గుతున్నదని చెప్పవచ్చు. ఇటు పక్క కాంగ్రెస్, అటు బిఎస్పీ వారు బీ ఆర్ ఎస్ నాయకులు, ప్రజాప్రతినిదులను తమ పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు. ప్రచారాలు కూడా జోరుగా సాగిస్తున్నారు.

A public blessing meeting filled with Josh
A public blessing meeting filled with Josh

ఈసారి టిఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా వెనకంజ వేసిందని చెప్పాలి. పార్టీ మేనిపెస్టో నుండి మొదలుకొని ఆయా నాయకుల టికెట్ల కేటాయింపులు, కెసిఆర్ పైన ఉన్న వ్యతిరేకం బాగా కనిపిస్తున్నది. వీటన్నింటిని పక్కన పెడితే ఇక నియోజకవర్గంలో అభ్యర్థుల ప్రచారం, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలోనే ఉంది. అప్పటి ఎన్నికల్లో సీఎం కెసిఆర్ ప్రతి చోట తనను చూసి ఓటు వేయమని అభ్యర్థించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మరోలా ఉంది. ఇక మరో విషయం ఏంటంటే ఓటర్లను మద్యం, డబ్బులకు అమ్ముడు పోవద్దనే నాయకులు, వారే అమ్ముడు పోతున్నా తమను నిందించడం సరికాదంటున్నా రు. ఇక ప్రధాన పార్టీలు గెలవాలంటే చివరి అస్త్రం డబ్బులు పంచడమేనని  పలువురు ప్రజాప్రతినిధులు చర్చించు కోవడం విశేషం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్