మేజిక్ రాజాకు అరుదైన గౌరవం
.
A rare honor for the Magic King
–పల్నాడులో సన్మానం
,గోదావరిఖని :
‘
ఖని’ కళాకారుడు మేజిక్ రాజాకు ఆంధ్రప్రదేశ్ లో అరుదైన గౌరవం దక్కింది. పల్నాడు జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నరసరావుపేటలోని భువనచంద్ర టౌన్ హాల్ లో ఆదివారం జరిగిన పల్నాడు మేజిక్ ఫెస్టివల్ -2025 కు రాజా వ్యాఖ్యాతగా వ్యవహరించి తన సమయస్పూర్తి, ఛలోక్తులతో కార్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించి సభికుల అభినందనలందుకున్నారు. అలాగే కరీంనగర్ కు చెందిన మెజీషియన్ నరేన్ లెక్చర్ కమ్ డెమానిస్ట్రేషన్.. సీనియర్ల ప్రశంసలందుకుంది. కాగా రాజా, నరేన్ తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెజీషియన్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి యతిరాజ్ ను అతిథులు, నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి ఫోటోతో కూడిన జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, అసోసియేషన్ వ్యవస్థాపకులు జేవిఆర్, అధ్యక్షులు వై.బాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి ఏ.నాగరాజు, కోశాధికారి పి.నాగేంద్ర ప్రసాద్, సీనియర్ మెజీషియన్లు డాక్టర్ బోస్, డాక్టర్ ఎస్. మనోహర్ రావు, డాక్టర్ ఆర్యల్, ఆలీ, ప్రదీప్ రంగ్రేజ్, రఘు బాబు, సామల వేణు, శ్యామ్, క్రాంతికార్, కేబీ విరాట్ వాలా, గౌస్, కే.విజయ్ కుమార్, టైగర్ మహ్మద్, ఎన్ఆర్ కరెంట్, మధుబాలతో పాటు ఖని కళాకారులు మేజిక్ హరి, చంద్రపాల్, ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి సుమారు మూడు వందల మంది ఇంద్రజాలికులు పాల్గొన్నారు. కాగా మేజిక్ రాజాకు ఈ అరుదైన గౌరవం దక్కడంపట్ల స్థానిక కళాకారులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.



