మాదన్నపేట్ పోలీసు స్టేషన్ లో ఘటన
ఆరు సార్లు కత్తితో దాడి చేయడంతో బాధితుడి పరిస్థితి విషమం
హైదరాబాద్:: సౌత్ ఈస్ట్ జోన్ పోలీసులు నేరాలను అదుపు చేయలేకపోతున్నారనే వాస్తవం రోజు రోజుకి నిజం అవుతుంది. మొన్న చాంద్రాయణ గుట్ట లో బావిజర్ హత్య, కంచన్ బాగ్ లో సయ్యద్ నషీర్ హత్య, ఐ ఎస్ సదన్ లో మాజీ హోం గార్డ్ హత్య. తాజాగా శుక్రవారం మాదన్నపేట్ పోలీసు స్టేషన్…ఇలా అన్ని పోలీసు స్టేషన్లో నేరాలు జరుగుతున్నాయి.
కేసు విషయానికోస్టే, తెలిసిన వ్యక్తియే ఇంట్లో నుంచి ఫోన్ దొంగలించాడు. తీసుకెళ్లిన ఫోన్ ను అడిగి తీసుకెళ్ళుదామని మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో రైన్ బజార్ చమన్ కు వచ్చారు. కానీ మీ ఫోన్ ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్ని సవాల్ విసరడమే కాకుండా బాధితులను భయబ్రాంతులకు గురి చేశాడు. దింతో భాదితులు మాదన్నపేట్ పోలీసులకు పిర్యాదు చేయడానికి వచ్చారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటన మాదన్నపేట్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ధాతునగర్ కు చెందిన మహ్మద్ ఫిరోజ్ సోదరి ఇంట్లో నుంచి రౌడీ షీటర్ ఇబ్రహీం ఫోన్ ను దొంగిలించారు. ఫోన్ తీసుకెళ్ళుదామని మాదన్నపేట్ కు వచ్చారు. ఫోన్ ఇవ్వాలని అడగగా భయబ్రాంతులకు గురి చేసాడు. దింతో బాధితులు మాదన్నపేట్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. పోలీసు స్టేషన్లో పిర్యాదు చేసి బయటికి వచ్చిన మహ్మద్ ఫిరోజ్ ను రౌడీ షీటర్ మహ్మద్ ఇబ్రహీం కత్తి తో పలుమార్లు దాడి చేసి పారిపోయాడు. దింతో బాధితుణ్ణి వెంటనే హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. రౌడీ షీటర్ ఇబ్రహీం గతంలో రెండు సార్లు పీడీ యాక్ట్ పై జైల్ కు వెళ్లి వచ్చారని బాధితుడి సోదరుడు తెలిపారు.