- Advertisement -
కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలి*
A separate ministry for OBCs should be set up at the Centre.
*బీసీ హక్కుల సాధన సమితి *ధనుంజయ నాయుడు డిమాండ్* కేంద్రంలో బీసీలకు ప్రత్యేక పత్రిక శాఖ ఏర్పాటు చేయాలని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు శుక్రవారం నాడు ఆయన హైదరాబాదులోని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యాలయం గురించి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో… కేంద్రంలో ఓ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేసినా ఫలితం లేదని ఇప్పటికైనా కేంద్రం ఓ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కేటాయించాలని ప్రస్తుతం కేంద్రంలో 58 మంత్రిత్వ శాఖలతో పాటు కేంద్ర ప్రభుత్వాధినం లో 93 విభాగాలు ఉన్నాయని కానీ నేటికీ కేంద్రస్థాయిలో ఓబీసీల సంక్షేమ అభివృద్ధి చూసుకోవడానికి ప్రత్యేక విభాగం లేదని ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు వంటి అనేక సామాజిక వర్గాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయని క్రీడలు సాంస్కృత కార్యకలాపాలు మరియు ఇతరత్ర ప్రాముఖ్యత లేని వ్యవహారాలకు మంత్రిత్వ శాఖలు ఉన్నాయని ఇటీవల మత్స్యకార మరియు సహకార శాఖలు సృష్టించారని కానీ జనాభాలో 56% ఉన్న బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయకపోవడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు కేంద్ర స్థాయిలో ఉపాధి మరియు విద్య స్థానిక సంస్థల ఎన్నికల్లో 27% రిజర్వేషన్లు అమలు చేయబడుతున్నాయని మరియు జాతీయ బీసీ కమిషన్ జాతీయ బిసి కార్పొరేషన్లు ఉన్నాయని ఇటీవల బీసీ పార్లమెంటరీ కమిటీ కూడా ఏర్పడిందని బీసీ రిజర్వేషన్లు మరియు ఇతర సమస్యలపై అనేక చట్టపరమైన వివాదాలు ఉన్నందున బీసీల రిజర్వేషన్లకు సంబంధించి అనేక సమస్య తరచుగా తలెత్తుతున్నాయని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల సబ్సిడీ రుణ పథకాలు మరియు అనేక రాష్ట్రాల లో అనేక పథకాలు బీసీలకు అభివృద్ధి కొరకు ఉద్దేశించి వివిధ పథకాలు మరియు కార్యక్రమాలు అమలు చేయాలి కాబట్టి వారికి సరైన పర్యవేక్షణ అవసరమని,కాబట్టి కేంద్ర స్థాయిలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని బీసీలకు సంబంధించిన అనేక సమస్యలు….వారి రిజర్వేషన్లు వెలుగులోకి వస్తున్నాయని ఆయన అన్నారు ఈ పరిస్థితులలో కొన్ని దశాబ్దాలుగా ఆలస్యమైనప్పటికీ ప్రత్యేక శ్రద్ధతో వేగవంతమైన అభివృద్ధి కోసం బీసీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు
- Advertisement -