Sunday, September 8, 2024

 గ్రేటర్ లో గులాబీకి షాక్…

- Advertisement -

 గ్రేటర్ లో గులాబీకి షాక్…
హైదరాబాద్, జూలై 6,
గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పరిస్థితి గందరగోళంగా మారింది. తెలంగాణ భవన్ లో ఆ పార్టీ నిర్వహించిన కీలక సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజర్ అయ్యారు. గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెపై అవిశ్వాసం పెట్టాలన్న యోచనలో బీఆర్ఎస్ ఉంది. అందుకే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రావాలని గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ సమాచారం పంపారు.అయితే ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.
శేరిలింగం పల్లి ఎమ్మెల్యే  అరికెపూడి గాంధీ, కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్పుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద హాజరు కాలేదు.  కాలేరు వెంకటేష్, పద్మారావు, ప్రకాష్ గౌడ్ మాత్రమే హాజరయ్యారు. మామూలుగా అయితే ఈ సమాశం కేటీఆర్ ఆధ్వర్యంలో జరుగుతోందని పిలిచారు. కానీ కేటీఆర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సమావేశానికి  హాజరు కాలేదు. తలసాని నేతృత్వంలో నిర్వహించారు. ఈ కారణంగా హాజరు కాలేదా లేకపోతే.. కాంగ్రెస్ పార్టీతో టచ్ లోకి వెళ్లారా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. సమావేశానికి హాజరు కావాలని ఫోన్లు చేసినా ఈ ఎమ్మెల్యేలు స్పందించలేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే పదిమంది కార్పొరేటర్లు కూడా హాజరు కాలేదు. మేయర్ గద్వాల విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టే ప్రయత్నాలు  ఈ  సమావేశానికి  గైర్హాజర్ అయిన నేతల వల్ల సాధ్యమయ్యే అవకాశం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. మెజార్టీ గ్రేటర్ ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లారని .. వారి అనుచరులైన కార్పొరేటర్లు కూడా అదే దారిలో ఉన్నారని అంటున్నారు. ఒక వేళ అవిశ్వాసం పెట్టినా మజ్లిస్ సహకరిస్తే తప్ప ముందుకు సాగలేరు. మజ్లిస్ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లే అవకాశం లేదని తెలుస్తోంది. గ్రేటర్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ ఘన విజయాలు సాధించింది.  కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అయితే రాష్ట్రంలో అధికారం పోవడంతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అభివృద్ధి కోంస.. పార్టీ మారాలన్న ఆలోచనలో ఉన్నారు. వారితో కాంగ్రెస్ సంప్రదింపులు జరిపిందని చెబుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో … సమావేశాలకు డుమ్మా కొట్టడంతో పార్టీ మార్పు ప్రచారాలకూ మరింత ఊపు వస్తున్నట్లవుతోంది

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్