Xiaomi నుండి 7 వేలకే అదిరిపోయే స్మార్ట్ ఫోన్….!
A smart phone from Xiaomi under 7 thousand....!
చైనా కి చెందిన Xiaomi కంపెనీ నూతనంగా సరికొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది .XIAOMI సబ్- బ్రాండ్ అయినా రెడ్ మీ నుండి అతి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నా స్మార్ట్ ఫోన్ అనే కాన్సెప్ట్ తో ఈ కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. పెరుగుతున్న టెక్నాలజీ అనుగుణంగా ఎన్నో కంపెనీలు రోజూ కి ఏదో ఒక స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తూ ఉంటాయి. అందులో Xiaomi కూడా కొత్త ఫ్యూచర్స్, కాన్సెప్ట్స్, కెమెరా, డిస్ప్లే ఇలా ఎన్నో ఆవిష్కరణలతో ముందుకి వస్తూ వుంటుంది.
రెడ్ మీ లాంచ్ చేసిన కొత్త స్మార్ట్ ఫోన్ పేరు REDMIA3x. ఈ మొబైల్ ఫోన్ ధర తక్కువ తో పాటు అదిరిపోయే ఫీచర్స్ ఉండటం తో మొబైల్ ప్రియులను ఆకట్టుకుంటుంది. REDMIA3x స్మార్ట్ ఫోన్ వేరియంట్ విషయానికి వస్తే 3GB RAM+ 64GB వేరియంట్ ధర రూ.6999 కాగా…… 4GB RAM+128GB వేరియంట్ ధర రూ.7999 మాత్రమే. రెండిటికీ కేవలం రూ.1000 డిఫరెన్స్ ఉండటం విశేషం.
ఎంట్రీ లెవెల్ బడ్జెట్ లో ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఛాయిస్ గా చెప్పుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో ఎక్కువ ఫ్యూచర్స్ ఉన్న మొబైల్ ఫోన్ కొనాలి అనుకునేవారికి ఈ ఫోన్ మంచి సెలక్షన్ అవుతుంది. ఇది కంపనీ A- సీరీస్ కి చెందిన బడ్జెట్ ఫోన్. సరికొత్త అoడ్రాయిడ్ సాఫ్ట్ వేర్ ఇందులో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ,5000MAH బ్యాటరీ, డ్యుయల్ రియర్ కెమెరా మరెన్నో ఫీచర్స్ Xiaomi విడుదల చేసింది.
Redmi A3x 6.71-అంగుళాల IPS LCD డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, HD+ రిజల్యూషన్ తో వస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 నీ అమర్చారు. Unisoc T603 ప్రాసెసర్‌తో దీన్ని రూపొందించారు. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు. 10W ఛార్జింగ్ తో మార్కెట్ లోకి విడుదల అయింది.



