భోగి’ సినిమా నుంచి అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే సాంగ్
A song from the movie ‘Bhogi’ that highlights the bond between a brother and sister.
చార్మింగ్ స్టార్ శర్వా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ ప్రమోషనల్ కంటెంట్‌తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటోంది. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం 1960ల ప్రారంభంలో మహారాష్ట్ర–ఆదిలాబాద్ సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. గ్రామీణ సంప్రదాయాలు, మానవ సంబంధాలు, సామాజిక పరిస్థితులతో ముడిపడిన సహజమైన పల్లెటూరి ప్రపంచాన్ని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి ఆసక్తిని రేకెత్తించగా, తొలి పాట ‘ఎగిలివారంగ’ సినిమాలోని పల్లె వాతావరణంతో కూడిన సంగీత ప్రపంచాన్ని పరిచయం చేసింది.
దసరాకు ఒక రోజు ముందు మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో పాట ‘అన్నయ్య పానం’ ను విడుదల చేశారు. ఐదుగురు చెల్లెళ్లపై ఒక అన్నయ్య చూపించే నిస్వార్థమైన ప్రేమ, ఆప్యాయతలను హృద్యంగా ఆవిష్కరించే ఈ పాటతో పాటు, ప్రధాన జంట ప్రేమకథకు సంబంధించిన కొన్ని అందమైన క్షణాలను కూడా చూపించారు.
పల్లెటూరి మట్టి వాసనతో కూడిన పాటలను అందించడంలో ప్రత్యేకత కలిగిన సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఈ పాటను మనసు ఆకట్టుకునేల స్వరపరిచారు.భావోద్వేగాల లోతుతో సాగే ఈ మెలోడీ వినగానే ఆకట్టుకుంటుంది. ఆస్కార్ విజేత, గీత రచయిత చంద్రబోస్ సాహిత్యంతో పాటకు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అనురాగం, త్యాగం, విడదీయలేని అనుబంధాన్ని తన సాహిత్యంలో అందంగా ఆవిష్కరించారు.
సింగర్ శ్రీకృష్ణ తన వోకల్స్ తో ఈ పాటకు ప్రాణం పోశారు. ఆయన వాయిస్ పాటలోని భావోద్వేగాలను మరింత పెంచుతుంది. కథలోని రొమాంటిక్ కోణాన్ని కూడా ఈ పాట ఆవిష్కరిస్తుంది. శర్వా, అనుపమ పరమేశ్వరన్ పాత్రల మధ్య కెమిస్ట్రీని అందంగా చూపించారు. అనీ మాస్టర్ కొరియోగ్రఫీ పాటలోని భావానికి చక్కగా సరిపోగా, సహజమైన పల్లెటూరి వాతావరణం, ఆప్యాయతతో కూడిన కుటుంబ సన్నివేశాలు విజువల్స్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి.
పల్లెటూరి యువకుడిగా శర్వా తన సహజమైన లుక్‌తో ఆకట్టుకున్నారు. నిజాయితీతో కూడిన నటనతో తన పాత్రకు భావోద్వేగాల లోతును జోడించారు. పాటలో ప్రధానంగా కనిపించే అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ఆయన నటన మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది. పల్లెటూరి అమ్మాయిగా అనుపమ పరమేశ్వరన్ అందంగా ఆకట్టుకున్నారు. అద్భుతమైన నటన, మనసును తాకే సాహిత్యం, అందమైన విజువల్స్ కలగలిసి ఈ పాటను ‘భోగి’ సంగీత ప్రయాణంలో గుర్తుండిపోయే పాటగా నిలబెట్టాయి.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్తో పాటు డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటించనున్నారు.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి




