- Advertisement -
వీధి కుక్కలకు వింత వ్యాధి
జనవరి 6 (వాయిస్ టుడే) రామకృష్ణాపూర్
రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరిగే వీధి కుక్కలకు వింత వ్యాధి సోకింది. వ్యాధి సోకిన కుక్కల చర్మం మొత్తం ఊడిపోయి పుండ్ల తో భయానకంగా కనిపిస్తున్నాయి క్రమంగా వాటి సంఖ్య పెరుగుతుంది. అధికారులు స్పందించి కుక్కలను జనావాసాలు లేని ప్రాంతంలో వదిలేయని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై మందమర్రి మండల పశు వైద్యాధికారి వాసిం ను వివరణ కోరగా ఇది కుక్కలకు వచ్చే సాధారణమైన వ్యాధి అని ఒక కుక్క నుండి ఇంకో కుక్కకు మాత్రమే సోకుతుంది. ముఖ్యంగా ఈ వ్యాధి వీధి కుక్కలకు మాత్రమే సోకుతుంది,
ఇది జంతు సంక్రమిత వ్యాధి అని మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని ఈ విషయమై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.
- Advertisement -



