- Advertisement -
పురుగుల మందు తాగి విద్యార్దిని ఆత్మహత్యాయత్నం
A student attempted suicide by drinking insecticide
కాకినాడ
పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం, రమణక్కపేట గ్రామంలో పదవ తరగతి విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యధావిధిగా స్కూలుకు వెళ్లేందుకు సిద్ధమైన చింతపల్లి నైపుణ్య (16), ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తను పనులు తాను బాగానే చేసుకుందని, స్కూల్ కి వెళ్లేందుకు తల్లితో కుమార్తె జడలు కూడా వేయించుకుందని తల్లి చింతపల్లి సుభాషిణి వాపోయింది.
ఇంతలో ఏమైందో ఏమో తెలియడంలేదని, ఇంటి బయట కుమార్తె పడి ఉండడం చూసి ఏం చేయాలో అర్థం కాలేదని కన్నీరు మున్నీరవుతుంది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు… అక్కడ నుండి మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు…
- Advertisement -