హాస్టల్ కిటికీలో నుంచి దూకిన విద్యార్థి మృతి

- Advertisement -

హాస్టల్ కిటికీలో నుంచి దూకిన విద్యార్థి మృతి
హైదరాబాద్

A student who jumped from the hostel window died

మాదాపూర్ పరిధిలోనీ నారాయణ కాలేజ్ హాస్టల్ నుండి కిందకి దూకి మృతి చెందాడు. స్నేహితులతో కలిసి బయటకు వెల్దామని కిటికీలో నుండి కిందకు దిగేందుకు శివకుమార్ రెడ్డి (17) ప్రయత్నించాడు. ఐదవ అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందాడు. రైల్వే కోడూరుకు చెందిన శివ కుమార్ రెడ్డి  మాదాపూర్ నారాయణ రెసిడెన్షియల్ కాలేజీ వర్మ క్యాంపస్ లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.  మెయిన్ గేట్ కు తాళాలు వేసి ఉండడంతో కిటికీలో నుండి గ్రిల్స్ పట్టుకుని కిందకు దిగేందుకు ప్రయత్నించాడు.

A student who jumped from the hostel window died

ఇది గమనించిన మిగతా స్నేహితులు తమ ప్రయత్నాన్ని విరమించుకుని వెనక్కి వచ్చి హాస్టల్ వార్డెన్ కు విషయం తెలిపారు. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరిన హాస్టల్ వార్డెన్ విద్యార్థి శివకుమార్ రెడ్డిని లేపి చూడగా అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి.

A student who jumped from the hostel window died

వెంటనే దగ్గరలో ఉన్న మెడికవర్ ఆస్పత్రికి తరలించగా శివకుమార్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. నారాయణ కాలేజీ నుంచి పడి విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాల నాయకులు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనలు చేస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular