- Advertisement -
అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన–హెచ్ఆర్పిసిఐ బృందం
A team of HRPCI conducted a surprise inspection of the Anganwadi center
నంద్యాల
కొలిమిగుండ్ల పట్టణంలోని 5అంగన్వాడి సెంటర్ ను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ ఆర్ కె. కంబగిరి స్వామి మరియు హ్యూమన్ రైట్స్ నంద్యాల జిల్లా ఇన్చార్జి మరియు కడప జిల్లా హ్యూమన్ రైట్స్ బీసీ సెల్ చైర్మన్ సంపంగి విజయ్ కుమార్ బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు తనిఖీలో భాగంగా సెంటర్ లోని పరిశుభ్రతను పరిశీలించి స్టోర్ రూమ్ లోని కోడిగుడ్లను పరిశీలించారు కాసేపు పిల్లలతో మాట్లాడి రోజువారి మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్నం భోజనమును పిల్లలతో కలిసి తిని భోజనంలోని నాణ్యతను పరిశీలించారు అంగన్వాడి సెంటర్లో టీచర్ త్రివేణి ఆయా రమాదేవి పిల్లలను ప్రేమాభిమానాలతో చూసుకుంటున్న తీరును పట్ల పిల్లలకు సవ్యంగా అందుకున్న భోజనంలోని నాణ్యత కోడిగుడ్లు మెనూ ప్రకారం పిల్లలకి అందిస్తున్న విధానాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం టీచర్ త్రివేణి ని ఆయా రమాదేవినీ ఇరువురిని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్ఆర్పిసిఐ బృందం అభినందించారు ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ విజిలెన్స్ సెల్ రాష్ట్ర చైర్మన్ డి దస్తగిరి గారు
హ్యూమన్ రైట్స్ విజిలెన్స్ సెల్ పబ్లిక్ రిలేషన్ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ పరమేశ్వరయ్య గారు మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -