Sunday, September 8, 2024

బెడిసికొడుతున్న వ్యూహం

- Advertisement -

బెడిసికొడుతున్న వ్యూహం
హైదరాబాద్, జూలై 13

A tricky strategy

తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లో చేర్చుకొని ప్రతిపక్షాన్ని వీక్ చేయడం.. ఎట్ ది సేమ్ టైం.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల వ్యూహం బెడిసికొడుతున్న సంకేతాలు కన్పిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తుండగా, కొంతమంది కాంగ్రెస్ నేతలు… వలస ఎమ్మెల్యేలతో కలవకుండా పార్టీని మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలను కాంగ్రెస్‌లో చేర్చుకుంటే… ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే ఉన్న నేతలు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో దూరంగా ఉంటుండటంతో పార్టీ రెండు వర్గాలుగా విడిపోతోందని టాక్ వినిపిస్తోంది.ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలను చేర్చుకోడాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు వారితో అస్సలు కలిసేందుకు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులను కాంగ్రెస్‌లో చేర్చుకుని, తమకు సరైన గౌరవం ఇవ్వడం లేదని ఎక్కువమంది మదనపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సమస్య దాదాపు ప్రతినియోజకవర్గంలోనూ కనిపిస్తుండటంతో పాత, కొత్త నేతల మధ్య సమన్వయం కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా మారిందంటున్నారు.హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోగా, తొలుత ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్‌ను ఆకర్షించి పార్టీలోకి ఆహ్వానించారు. కానీ, నాగేందర్‌కు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయారెడ్డి మాత్రం దానం చేరికను సహించలేకపోతున్నారు. దానం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని దాదాపు నాలుగైదు నెలలు కావస్తున్నా, విజయారెడ్డితో సయోధ్య కుదరడం లేదంటున్నారు. దానం నాగేందర్ రాకను వ్యతిరేకిస్తూ.. పి.విజయారెడ్డి అనుచరులు ఏకంగా గాంధీభవన్‌లో నిరసనకు దిగారు. అయినా ఈ ఇద్దరి మధ్య రాజీ కుదర్చడంలో కాంగ్రెస్ నాయకత్వం పెద్దగా దృష్టి పెట్టినట్లు లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఖైరతాబాద్‌కు చెందిన ఈ ఇద్దరూ ఇప్పటివరకు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేని పరిస్థితి ఏర్పడింది.ఇక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేరిక విషయంలోనూ ఇదే సీన్ కనిపించింది. కడియం శ్రీహరికి ప్రత్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ మహిళా నాయకురాలు ఇందిర… కడియంతో ఎడమొహం పెడమొహంగానే వ్యవహరిస్తున్నారు. కడియం చేరికను ఇందిర వర్గం తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అదే విధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం చేరికను ఆయనపై ఓడిన ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ క్యాడర్ ఇప్పటికీ జీర్ణించుకోవడం లేదని టాక్ నడుస్తోంది.ఇక జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేరిన తర్వాత జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లాస్ట్ చాన్స్ అంటూ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. తన స్థానంలో మరొకరు నియోజకవర్గానికి రావడాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఏకంగా ఢిల్లీ స్థాయిలో నిరసనకు దిగడమే కాకుండా, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ హైకమాండ్ కే హెచ్చరికలు పంపారు. కాంగ్రెస్ పెద్దలు సర్ది చెప్పడంతో జీవన్‌రెడ్డి మెత్తపడినా, ఎమ్మెల్యే సంజయ్‌తో చేతులు కలిపే విషయంలో మాత్రం ససేమిరా అంటున్నారు.జీవన్‌రెడ్డి ఎపిసోడ్ మరచిపోకముందే తాజాగా కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విషయంలోనూ ఇదే స్థాయిలో రచ్చ జరిగింది. గద్వాలలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సరిత తిరుపతయ్యతోపాటు ఆమె అనుచరులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా సరితకు నచ్చజెప్పినా ఆమె అనుచరులు వినలేదు. గద్వాల నుంచి వందల సంఖ్యలో గాంధీభవన్‌కు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు దుమ్ము లేపారుఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ సమస్యలు ఉన్నాయని… పాత, కొత్త కాంగ్రెస్ అంటూ విభజన రేఖ గీసుకుని క్యాడర్ గ్యాప్ మెయింటైన్ చేస్తోందని అంటున్నారు. దీని వల్ల కాంగ్రెస్ మరింత బలపడాలనే ప్లాన్ బెడిసికొట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరుతున్న నేతల విషయంలో పార్టీ పెద్దలు ముందుగానే మాట్లాడి పాత క్యాడర్‌ను ఒప్పిస్తే ఇలాంటి సమస్య ఎదురయ్యేది కాదంటున్నారు. సమస్యలు వచ్చిన నియోజకవర్గాల్లో ఎక్కువ రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకున్నవే కావడంతో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ గ్యాప్ అనేది నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టిక్కెట్ పంచాయతీతో మరింత ముదిరే అవకాశాలే ఉన్నాయని కేడర్ భావిస్తోంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్