- Advertisement -
నూతన విద్యా విధానంపై ఏ.యు లో రెండు రోజుల జాతీయ సదస్సు
A two-day national conference on New Education Policy at AU
విశాఖపట్నం (నవంబర్ 9):
ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యా విభాగం ఆధ్వర్యంలో ఈనెల 11 12 తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు విద్యా విభాగాధిపతి, సదస్సు డైరెక్టర్ డాక్టర్ టి.షారోన్ రాజు తెలిపారు. శనివారం ఉదయం విభాగంలో సదస్సు వివరాలను ఆయన వివరించారు. ఈక్విటీ, డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ఎన్.ఈ.పీ 2020 ఇష్యూస్, కన్సన్స్ అండ్ చాలెంజెస్ అనే అంశంపై రెండు రోజులు సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సహకారంతో సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్లాటినం జూబ్లీ గెస్ట్ హౌస్ లో 11వ తేదీ సోమవారం నాడు సదస్సును ఏయూ విసి ఆచార్య జి.శశిభూషణరావు ప్రారంభిస్తారని చెప్పారు.
రెండు రోజుల సదస్సులో భాగంగా నూతన విద్యా విధానం 2020 అమలు అనంతరం అంశాలు నిపుణులు చర్చిస్తారు. ప్రధానంగా నాణ్యత కలిగిన టీచర్ల శిక్షణ అవసరాన్ని సూచించడం , గ్రామీణ ప్రాంతాల, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సైతం నూతన విద్యా విధానం అందుబాటులో ఉండే విధంగా చూడటం, వైవిధ్యమైన విద్యార్థుల కోసం అనుకూలమైన నూతన పాఠ్యక్రమం అభివృద్ధి తదితర అంశాలను ఈ సదస్సులో నిపుణులు చర్చిస్తారు.
సదస్సులో పోర్ట్ అథారిటీ కార్యదర్శి టి. వేణుగోపాల్, మను కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యులు పి.అడం పాల్ పాటేటి, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ ఆచార్య స్వరూపారాణి, ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం (అమర్ కంటక్) విద్యా విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం. టీ.వీ నాగరాజు, ఎన్సీఈఆర్టీ – రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైసూర్ విద్యా విభాగం ఆచార్యులు ఆచార్య విశ్వనాధప్ప తదితరులు పాల్గొని విశిష్ట ప్రసంగాలు అందిస్తారు.
రెండో రోజు ఇగ్నో రీజినల్ కేంద్రం సీనియర్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ జి.ధర్మారావు, ఒడిశాలోని రేవనేశ్వ యూనివర్సిటీ డీన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ సుదర్శన్ మిశ్రా, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సిక్కిం ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒరిస్సా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈ.అశోక్ కుమార్, మేఘాలయ రాష్ట్రంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ జి.మధుకర్ తదితరులు సదస్సులో ప్రత్యేక ప్రసంగాలు చేస్తారు.
- Advertisement -