హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం
ఖమ్మం
ఖమ్మంలోని తన నివాసానికి విచ్చేసిన మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆత్మీయ స్వాగతం పలికారు.శాసనమండలికి నల్లగొండ -ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డికి ఘన విజయం చేకూర్చేందుకు గాను హరీష్ రావు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల పర్యటించనున్నారు.తన పర్యటనలో భాగంగా హరీష్ రావు గురువారం రాత్రి ఖమ్మం బురహాన్ పురంలోని ఎంపీ రవిచంద్ర నివాసానికి చేరుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా హరీష్ రావు వెంట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ తదితరులు ఉన్నారు
హరీష్ రావుకు ఆత్మీయ స్వాగతం
- Advertisement -
- Advertisement -