ఖమ్మం, నవంబర్ 15, (వాయిస్ టుడే): పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. పది సంవత్సరాలుగా బిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేసి తిన్నటువంటి సొమ్మును కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కక్కిస్తామని, దోపిడి అరకడతామని అన్నారు. బీఆర్ఎస్ పరిపాలన నలిగిపోతున్న తెలంగాణ ప్రజలకు విముక్తి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటో కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలని తెలిపారు. ఎర్రుపాలెం మండలం తెల్లపాలెం గ్రామంలో భట్టి ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారుతెల్లపాలెంలో భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇల్లు, ఇంటి స్థలం, ఫీజు రియంబర్స్మెంట్, సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చారా? కరెంటు ఇచ్చారా? పది సంవత్సరాలుగా తెలంగాణకు ఏం చేశారు? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా బిఆర్ఎస్ పరిపాలన మారిందని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఐదు సంవత్సరాలు ప్రజల్లోనే ఉన్న… కేసీఆర్, కేటీఆర్, హరీష్ ఎప్పుడైనా ప్రజల్లో కనిపించారా? అని ప్రశ్నించారు. దొరల తెలంగాణ వద్దు ప్రజల తెలంగాణ తెచ్చుకుందామన్నారు. ప్రజల సంపద ప్రజలకి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెల్ల పాలెం నుంచి జమలాపురం వరకు రోడ్డును వేయిస్తామని హామీ ఇచ్చారు.ఫామ్ హౌస్ కే పరిమితమైన వ్యక్తికి ప్రజల సమస్యలు ఎలా తెలుస్తాయని అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్‌తో ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని అన్నారు. కానీ కేసీఆర్ పాలనలో రాష్ట్రం దోపిడీకి గురైందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు దిశగా కాంగ్రెస్ ఉందని తెలిపారు. రాష్ట్రం సంపదను పదికోక్కుల్లా దోచుకొని కాంగ్రెస్ పార్టీ ని విమర్శించడానికి సిగ్గుండాలని తెలిపారు. ప్రజలపక్షాన పోరాడేందుకే రాష్ట్రలో తిరిగానని అన్నారు. సంపద కలిగిన రాష్ట్ర కనుక 6 గ్యారంటీలు ప్రకటించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజల కోసం అలోచన చేసే.. పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ,అభివృద్ధి పథకాలు తిరిగి అమలు చేస్తామన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎర్రుపాలెం మండలంలో నిధులు పారించామన్నారు. కాంగ్రెస్ తెలంగాణలో గెలవడం ఖాయమని తెలిపారు. ఎవరు ఏం చేసినా కాంగ్రెస్ తెలంగాణ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.