- Advertisement -
కరెంటు పోల్ ఎక్కి యువకుడు ఆత్మహత్య
A young man committed suicide by climbing an electric pole
అమరావతి నవంబర్ 9కరెంటు పోల్ ఎక్కి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. అత్తిలి రైల్వే స్టేషన్ లో తమిళనాడుకు చెందిన యువకుడు కరెంటు పోల్ ఎక్కి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం కరెంట్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడంతో స్టేషన్ మాస్టర్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో ఆ యువకుడు కరెంటు వైర్ తాకి కిందపడి చనిపోయినట్లు చెప్పారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
- Advertisement -