
Abhinandhana Sabha for Ministers
హైదరాబాద్: ఈ నెల 21వ తేదీ, గురువారం రవీంద్ర భారతిలో మంత్రులకు అభినందన సభ,జవహర్‌లాల్ నెహ్రు జర్నలిస్టుల మాక్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుల సమావేశం జరుగుతుందని ఆ సొసైటీ ఫౌండర్ మెంబర్ పివి రమణరావు ఒక ప్రకటనలో తెలిసారు. ఈ కార్యక్రమానికి సమాచార శాఖ, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ-సహకారం శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు.ఇదే సమావేశంలో జేఎన్‌జే మాక్స్ హౌసింగ్ సొసైటీ ప్రస్తుత కమిటీ స్థానంలో కొత్త కమిటీ ఎన్నుకునే అంశంపై చర్చ జరగనున్నదని తెలిపారు. ఈ సమావేశానికి సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో హైదరాబాద్ జర్నలిస్టులకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన స్థలాలను జేఎన్‌జే మాక్స్ హౌసింగ్ సొసైటీకి స్వాధీనం చేయాలని
స్రుపీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును అమలు చేయకుండా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించి జర్నలిస్టులకు అన్యాయం చేసిందిన ఆయన పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును కాలరాసిన బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాము చేపట్టిన పోరాటానికి అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, అప్పటి పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిగార్లు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. సుధీర్ఘకాలంలో పెండింగ్‌లో ఉన్న మా ఇంటి స్థలాల సమస్య పరిష్కరిస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టారు. ఘన విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాకు స్థలాలు స్వాధీనం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రి వర్గానికి కృతజ్ఞతగా అభినందనసభ ఏర్పాటు చేసినట్లు ఆ ప్రకటనలో రమణరావు వెల్లడించారు


