Thursday, February 19, 2026

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన లైన్‌మన్

- Advertisement -

లంచం తీసుకుంటూ ACB కి చిక్కిన లైన్‌మన్

ACB catches lineman taking bribe
పల్నాడు
నకరికల్లు మండలం చేజర్ల గ్రామంలో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లైన్‌మన్ నక్కబోయిన నాగేంద్రబాబును పట్టుకున్నారు. చేజర్లకు చెందిన గుండాల యోహాన్ తన పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరగా, ఇందుకు నాగేంద్రబాబు రూ. 70 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. లైన్ మెన్ గా విధులు నిర్వహిస్తున్న అతడు తన తండ్రి ద్వారా డబ్బుల లావాదేవీలు జరిపినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
డబ్బుల డిమాండ్‌తో విసిగిపోయిన రైతు విజయవాడలోని ఏసీబీ కార్యాలయాన్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అధికారులు పక్కా ప్రణాళికతో కాపుకాసి లంచం స్వీకరిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ ఎస్పీ మహేంద్ర మత్తె ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఎస్ఐలు దాడుల్లో పాల్గొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్