ఒకటి, రెండు రోజుల్లో టీఆర్ఎస్ జాబితా
హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ చూస్తున్నాం . అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలో KCR కసరత్తు పూర్తైపోయింది. దాదాపుగా సిట్టింగ్‌లకే సీట్లు కన్ఫామ్ చేస్తున్నారు.. ఈ రాత్రి లేదా రేపు BRS అభ్యర్థులపై ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందింది. 119 స్థానాలకు గాను.. 112 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేసేశారట ముఖ్యమంత్రి. కేవలం 6 స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి మెదక్‌లో ఒక స్థానంలో, ఆదిలాబాద్‌లో రెండు స్థానాల్లో.. ఉమ్మడి వరంగల్‌లో ఒక చోట, ఉమ్మడి కరీంనగర్‌లో మరో చోట అభ్యర్థల మార్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రంగారెడ్డిలో కూడా ఒక చోట సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వడం లేదట. 95 శాతం వరకు సిట్టింగులకే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారట. ఇప్పటికే ఆయా స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల బుజ్జగింపు కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ 6 స్థానాల్లో ఒకచోట ఎమ్మెల్సీకి, మరో చోట జెడ్పీ చైర్మన్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. దీన్ని బట్టి చూస్తే నోటిఫికేషన్‌కి ముందే దాదాపుగా అభ్యర్థుల్ని ప్రకటించినట్టే లెక్క.. MIM పోటీ చేసే స్థానాలు మినహా ఇస్తే మిగతా చోట్ల ఫైనల్ అయిపోయినట్టే.. ఏ ప్రాతిపదికన టికెట్లు ఫైనల్ చేశారు.. KCR గేమ్ ప్లాన్ ఏంటి..? అన్నది ఆసక్తికరంగా మారింది. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది.. ఇలాంటి టైమ్‌లో కూడా ధైర్యంగా 95 శాతం సీట్లు వారికే ఇవ్వబోతున్నారు కనుక.. కేసీఆర్ అందుకు కావాల్సిన యాక్షన్ ప్లాన్ రెడీ చేసే ఉంటారన్నది పొలిటికల్ టాక్. అసంతృప్తితో ఉన్న నేతల్ని ఎలా బుజ్జగించారు.. వారికి ఎలాంటి హామీ ఇచ్చారన్నది ఆసక్తికరం. ఎన్నికలకు 100 రోజుల ముందే యాక్షన్‌లోకి అన్నట్టుగా దూకుడు చూపిస్తూనే.. శ్రావణం సెంటిమెంట్ ఫాలో అయ్యి కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటిస్తారా అన్న చర్చ కూాడా జరుగుతుంది, కమ్యూనిస్టులతో పొత్తు ఉంటుందనే సంకేతాలు ఉన్నాయి.. మరి వాళ్లకు ఏమైనా ఒకట్రెండు సీట్లు కేటాయించే ఛాన్స్ ఉందా.. అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.. MIM అభ్యర్తులు ఉన్న చోట్ల ఏం చేస్తారు అన్నది కూడా తెలియాలి ఉంది.
గాంధీభవన్‌లో ప్రారంభమైన అసెంబ్లీ టికెట్ దరఖాస్తుల ప్రక్రియ
గాంధీభవన్‌లో అసెంబ్లీ టికెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కలిసి అప్లికేషన్ ఫామ్‌లు రిలీజ్ చేశారు. దీంతో అభ్యర్థుల అనుచరుల హడావుడి కనిపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకి 25వేలు.. బీసీ, ఓసీ అభ్యర్థులకి 50వేల రూపాయలు అప్లికేషన్ ఫామ్ ఫీజుగా నిర్ణయించారు. అయితే చెల్లింపు రుసుము డీడీల రూపంలో ఉండటంతో ఆశావహులు అప్లికేషన్లు తీసుకుని వెళ్లిపోతున్నారు. సిట్యువేషన్ చూస్తుంటే ఇవాళ అప్లికేషన్‌లు అంతంత మాత్రంగానే వస్తాయని తెలుస్తోంది