- Advertisement -
కోహెడ పోలీస్ స్టేషన్ ను సందర్శించిన ఏసిపి వి. సతీష్
ACP who visited Koheda Police Station V. Satish
కోహెడ
పోలీస్ అధికారులు సిబ్బంది ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. గ్రామాలను తరచుగా వీపిఓ లు సందర్శించాలి. నిజాయితీగా విధులు నిర్వహించడం చాలా ముఖ్యం ప్రజల ధనమాన ప్రాణ రక్షణకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలిప్రతి దరఖాస్తుదారులతో మర్యాదగా మాట్లాడాలని ఏసీపీ వి సతీష్ అన్నారు. శుక్రవారం నాడు అయన కోహెడ పోలీసు స్టేషన్ ను తనిఖీ చేసారు. ఏసీపీ మాట్లాడుతూ. అంకిత భావంతో విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు, నమోదవుతున్న కేసుల గురించి మరియు కేసుల పనితీరును పరిశీలించారు. దొంగతనాల నివారణ గురించి పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బంది తరచుగా కేడీలు డీసీలు సస్పెక్ట్ లను పై నిఘా ఉంచాలన్నారు, ప్రతిరోజు ఉదయం సాయంత్రం విసబుల్ పోలీసింగ్ విధులు నిర్వహించాలని సూచించారు. ప్రతిరోజు ఎన్ఫోర్స్మెంట్ విధులు నిర్వహించాలని, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఇన్ఫర్మేషన్ వ్యవస్థను మెరుగుపరచుకొని నిఘా ఉంచాలని తెలిపారు.
పోలీస్ స్టేషన్ లో ఉన్న రికార్డ్స్ ను ఫైల్స్ ను పరిశీలించారు.
సాధ్యమైనంత త్వరగా కేసులు డిస్పోజల్ చేయాలని సూచించారు. పోలీస్ స్టేషన్ ను వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలని ఓపికగా వారి బాధలు విని సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పోలీస్ స్టేషన్ మనం పని చేసే చుట్టూ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సిబ్బందికి సూచించారు. వివిధ కారణాలతో సీజ్ చేసిన వాహనాలను చట్ట ప్రకారం సంబంధిత బాధితులకు అప్పగించాలని తెలిపారు. కేటాయించిన విపిఓలు వారంలో మూడు నాలుగు సార్లు వార్డులను గ్రామాలను తప్పకుండా సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు మెరుగు పరుచుకోవాలని సూచించారు. సిద్దిపేట పట్టణం కాబట్టి ప్రతి ఒక్కరూ యూనిఫాంలో విధులు నిర్వహించాలని తెలిపారు. రైతు బజార్ ఓల్డ్ బస్టాండ్ తదితర ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే రెస్పాండ్ అయి సాధ్యమైనంత త్వరగా సంఘటన స్థలానికి చేరుకొని సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
కేడీలు,డిసీలు,సస్పెక్ట్ లు రౌడీలపై మరింత నిఘా ఉంచాలని తెలిపారు. అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని తెలిపారు ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ప్రతిరోజు నిర్వహించాలన్నారు.
ముందస్తు సమాచారాన్ని సేకరించాలని సైబర్ నేరాలు, తదితర అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఇసుక, పిడిఎస్ రైస్, గంజాయి ఇతర మత్తు పదార్థాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ సీఐ శ్రీనివాస్, కోహెడ ఎస్ఐ అభిలాష్, ఏ ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -