Sunday, January 12, 2025

హరిత హోటల్ ను ప్రైవేటు లాడ్జిగా మార్చిన ఏపీ టూరిజం అధికారులపై చర్యలు తీసుకోవాలి-సిపిఐ డిమాండ్

- Advertisement -

హరిత హోటల్ ను ప్రైవేటు లాడ్జిగా మార్చిన ఏపీ టూరిజం అధికారులపై చర్యలు తీసుకోవాలి-సిపిఐ డిమాండ్

Action should be taken against AP Tourism officials who converted Harita Hotel into a private lodge-CPI demand

అధికారుల నిర్లక్ష్యంతోనే శిథిలావస్థలో హరిత హోటల్
-తక్షణమే పునః ప్రారంభించాలి

సిపిఐ పర్యటనలో బయటపడ్డ నిజరూపాలు
-తక్షణమే కలెక్టర్  స్పందించాలి

బద్వేలు

కవయిత్రి మొల్ల మాంబ పేరుతో ఏర్పాటు చేసిన హరిత హోటల్ నిరుపయోగంగా పెట్టడం చాలా బాధాకరం తెలుగు కవులలో ప్రఖ్యాతి పొందిన రచయిత మొల్లమాంబ జన్మించిన గోపవరంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హరిత హోటల్ గత కొంతకాలంగా నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరుతున్న సందర్భంలో తక్షణమే ఆ టూరిస్ట్ హోటల్ ను ఉపయోగములకు తీసుకురావాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ…. ఏపీ టూరిజం లో పనిచేస్తున్నటువంటి హరిత హోటల్ ప్రయాణికులకు పర్యాటకులకు మరియు స్థానిక ప్రజలకు ఉపయోగపడలే తప్ప సెంచరీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు మరియు ప్రైవేటు వ్యక్తులకు ఒక లాడ్జిగా వాడుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.మోల్లమాంబ జన్మించిన ఈ గ్రామంలో ఎంతో చరిత్ర ఉందని అలాంటి ఆనవాలను ఈరోజు అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాసిపోయే ప్రమాదం ఉందని తక్షణమే ఈ హరిత హోటల్ ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ఇప్పటికే ఆ ప్రాంతమంతా విపరీతంగా చెట్లు పెరిగి, జంతువుల మలినాలతో నిండిపోయిందని కిటికీలు, తలుపులు పగిలిపోయి కుర్చీలన్నీ నిరుపయోగంగా ఉన్నాయని గార్డెన్ లో ఉన్న వస్తువులన్నీ విరిగిపోయినాయని తక్షణమే ఈ హరిత హోటల్ ప్రారంభించి ప్రజా అవసరాల కోసం ఉపయోగించాలని ఒక పర్యాటక ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తగు ఏర్పాటు చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి పెంచలయ్య ఏరియాకార్యవర్గ సభ్యులు పి.వి రమణ మండల నాయకులు షేక్ ఖాదర్ బాషా, వెంకటయ్య ఓబులేసు, పెంచలయ్య శివ లక్ష్మయ్య నరసింహ సుబ్బరాయుడు బాల ఓబులేసు రాజేష్, సంటయ్య  నాగయ్య తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్