జాతీయ నిర్మాణంమే లక్ష్యం గా కార్యకర్తలు కదలాలి
–విదేశీ కుట్రలపై అప్రమాత్రంగా ఉండాలి
—విభాగ్ కన్వీనర్ అజయ్
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ అక్టోబర్31(వాయిస్ టుడే)
జాతీయతే ఊపిరిగా దేశం కోసం పనిచేసే యువకుల సేవలు విద్యార్థి లోకానికి అవసర మని ఏబీవీపీ విభాగ్ కన్వీనర్ అజయ్ అన్నారు. మంగళవారం స్థానిక వేణుగోపాల స్వామి టెంపుల్ లో జరిగిన ఏబీవీపీ సుల్తానాబాద్ నగర ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్య అతితగా హాజరై మాట్లాడుతూ జాతీయ పునర్నిర్మాణమే లక్ష్యంగా కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న విదేశీ కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. దేశ సమగ్రతను దెబ్బ తీయడమేం కొరకు కులాల మధ్య కుంపటిని రగిలించే ప్రయత్నం చేస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. విద్యార్థి వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇంటికి సాగనంపి, విద్యార్థులకు మంచి భవిశ్యత్తును అందించేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం సుల్తానాబాద్ నగర నూతన కమిటిని జిల్లా కన్వీనర్ బండి రాజశేఖర్ ప్రకటించారు.నూతన సుల్తానాబాద్ నగర
కార్యదర్శిగా అమర గాని శ్రీనివాస్ నగర ఉపాధ్యక్షులు కుమారస్వామి, వివేక్, సిద్దు, కార్తికేయ, నగర సంయుక్త కార్యదర్శిగా వినయ్, రాజ్ కుమార్, వర్షిత్, ఉదయ్ కిరణ్,
విద్యార్థి శక్తి ఇంచార్జ్ సాయికుమార్ సందీపనీ ఇంచార్జ్ సుజన్ కుమార్ ఎస్ ఎఫ్ డీ ఇంచార్జ్ రంజిత్ కుమార్ ఎస్ ఎఫ్ ఎస్ ఇంచార్జ్ రాహుల్, కళమంచ్ ఇంచార్జ్ శ్రావణ్, ఖేల్ ఇంచార్జ్ ఉదయ్, కార్యవర్గ సభ్యులు శివ, సందీప్, సాయి, రాజు,
ఈ కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేల్పుల నాగచంద్ర జిల్లా హాస్టల్స్ కన్వీనర్ రాసురి ప్రవీణ్,జిల్లా ఎస్ ఎఫ్ డి కన్వీనర్ విష్ణుభక్తుల రిషి నాయకులు తదితరులు పాల్గొన్నారు..