Tuesday, March 24, 2026

ఎంపీ వద్దిరాజును కలిసిన ఉద్యమకారులు

- Advertisement -

ఉద్యమకారుల డిమాండ్లను BRS ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలి

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు వినతిపత్రం అందచేసిన తెలంగాణ ఉద్యమకారులు

ఖమ్మం: తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని జైళ్లకు వెళ్లామని,బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బాటలో నడుస్తున్నామని, తమ డిమాండ్లను పార్టీ మ్యానిఫెస్టోలో చేర్చాలని ఉద్యమకారులు కోరారు. ఈ ఉద్యమకారులకు నామినేటెడ్, పార్టీ పదవుల్లో అవకాశం కల్పించాలని,  జైలు జీవితం గడిపిన ప్రతి ఉద్యమకారుడికి పెన్షన్ ఇవ్వాలని కోరుతూ ఎంపీ రవిచంద్రకు వినతిపత్రం సమర్పించారు.ప్రతి ఉద్యకారుడికి 500 గజాల ఇంటి స్థలంతో పాటు 10 లక్షల ఆర్ధిక సహాయం చేయాలని కోరారు.తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి నాయకులకు ప్రభుత్వోద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు, పథకాల అమలులో ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ   న్యాయమైన  తమ కోరికలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి, మేనిఫెస్టోలో పెట్టేలా కృషి చేయాల్సిందిగా ఎంపీ రవిచంద్రకు విజ్ఞప్తి చేశారు.

ఎంపీ వద్దిరాజు వెంటనే స్పందించి,ముఖ్యమంత్రి కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి  ఉద్యమకారులందరికి తగు న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీనిచ్చారు.  వినతిపత్రం అందచేసిన వారిలో  BRS పార్టీ వ్యవస్థాపక సభ్యులు పగడాల నరేందర్, గుండ్లపల్లి శేషగిరిరావు,BRS విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రడం సురేష్  గౌడ్,యువజన విభాగం రాష్ట్ర నాయకులు నందిగామ రాజ్ కుమార్,విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు లింగనబోయిన సతీష్, ఉద్యమకారులు   దరిపల్లి వీరబాబు, నాగుల్ మీరా, అసిఫ్, వసీం ఖాన్,చల్లపల్లి అజయ్ చారి, బంక వెంకన్న, గ్లోరీ, గద్దల మరియ కుమారి ,మోగిలిచర్ల వెంకట్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్