- Advertisement -
కొత్తగూడెంకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు బీఆర్ఎస్ అభ్యర్థికి సంపూర్ణ మద్దతునిస్తామని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు స్పష్టమైన హామీనిచ్చారు.కొత్తగూడెం తెలంగాణ భవన్ లో గురువారం సాయంత్రం ఎంపీ రవిచంద్ర తెలంగాణ ఉద్యమకారులతో ఇష్టాగోష్టి జరిపారు.ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని శ్రద్ధగా విన్న ఉద్యమకారులు తామంత ముఖ్యమంత్రి కేసీఆర్ కు,ఆయన పంపించిన అభ్యర్థి,ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సంపూర్ణ మద్దతునిస్తామంటూ ప్రతిజ్ఞ చేశారు.
- Advertisement -