విజయవాడ: సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని సినీ నటుడు పద్మ భూషణ్ కమల్ హాసన్ శుక్రవారం ఆవిష్కరించారు. గురునానక్ కాలనీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ తో కలిసి కమల్ హాసన్ ఆవిష్కరించారు. దేవినేని అవినాష్ మాట్లాఉతూ తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ . అయన వారసత్వంతో ఇండస్ట్రీ లోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీరంగంలో,ఇటు సేవ కార్యక్రమాలూ లో ముందుంటు కృష్ణ పేరు నిలబెడుతున్నారని అన్నారు. ఎప్పుడు షూటింగ్ లలో బిజీగా ఉండే కమల్ హాసన్ ఇక్కడకు రావటం సంతోషం. నగర ప్రజల తరపున,,కృష్ణ ..మహేష్ బాబు అభిమానుల తరపున ఆయనకు ధన్యవాదాలు. పదిరోజుల వ్యవధిలోనే కృష్ణ విగ్రహ ఏర్పాటుకు సహకరించిన సీఎం జగన్ కు కృష్ణ కుటుంబ సభ్యులు తరపున ప్రత్యేక ధన్యవాదాలని అన్నారు.




