పరారీలో నటి కస్తూరి

- Advertisement -

పరారీలో నటి కస్తూరి

Actress Kasturi is on the run

చైన్నె :
తెలుగు ప్రజలపై ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీనటి కస్తూరి పరారీలో ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.  బ్రాహ్మణుల భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ హిందూ మక్కల్ కట్చి ఆధ్వర్యంలో చెన్నైలో నిర్వహించిన ఆందోళనలో పాల్గొన్న ఆమె తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.  దీనిపై పలు తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేశారు.  చెన్నై ఎగ్మోర్లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.  ఈ కేసులో సమన్లు ఇవ్వడానికి పోలీసులు శనివారం పోయెస్ గార్డెన్లోని కస్తూరి ఇంటికి వెళ్లారు.  ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె సెల్ నంబరుకు ఫోన్ చేశారు. స్విచాఫ్ అని రావడంతో పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. గాలించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular