- Advertisement -
ఆదాని ఒప్పందాలు రద్దు చేయాలి
Adani contracts should be cancelled
విశాఖపట్నం
సేకి నుంచి విద్యుత్ ఒప్పందాలు చేసుకునేందుకు భారీ ముడుపులు చెల్లించిన ఆదానీ ని వెంటనే అరెస్ట్ చేయాలని, రాష్ట్ర ప్రభుత్వంతో ఆదానీ గ్రూపు చేసుకున్న ఒప్పందాలను అన్నింటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నేతలు విశాఖలో నిరసన వ్యక్తం చేశారు.జీవిఎంసీ వద్ద ఆదానీ ఫ్లెక్సీని దహనం చేసి నిరసన తెలిపారు.అంతర్జాతీయంగా ప్రధాని మోడీకి అత్యంత ఆప్తుడైన ఆదానీ అవినీతి, అక్రమాల బాగోతం అమెరికాలో బయటపడినా ఇప్పటివరకు ప్రధాని మోడీ ఈ సంఘటనపై పెదవి మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. గతంలో ఇదే ప్రధాని మోడీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, టిఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత, ప్రతిపక్ష పార్టీ మంత్రుల నేతలను ఆధారాలు లేకపోయినా కేవలం ఆరోపణలతో అరెస్టు చేసిన మోడీ ప్రభుత్వం మరి ఆదానీ విషయంలో ఎందుకని అలసత్వం వహిస్తున్నారో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
- Advertisement -