Sunday, December 22, 2024

జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ

- Advertisement -

జగన్ ఫ్యామిలీలో ఆదానీ రచ్చ

Adani Racha in the Jagan family

టార్గెట్ చేసిన షర్మిళ, బాలినేని
విజయవాడ, నవంబర్ 29, (వాయిస్ టుడే)
కి పవర్ అగ్రిమెంట్స్‌ లొల్లి రోజురోజుకు కాక రేపుతోంది. వారం రోజులుగా దేశంలో హాట్ టాపిక్‌ ఇష్యూగా కొనసాగుతోంది. ఈ వ్యవహారం ఓ వైపు పార్లమెంట్‌ సమావేశాలను కుదిపేస్తుండగానే..మరోవైపు ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. సెకి ఫైల్‌కు ఆగమేఘాల మీద ఆమోదం తెలిపారని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. అవసరమైతే జగన్‌ మీద కేసు పెట్టేందుకు న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుందట. ఇంతలోనే అటు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కామెంట్స్..ఇటు మాజీమంత్రి బాలినేని కౌంటర్‌ కొత్త రచ్చకు దారి తీస్తున్నాయి.ఇది చాలదన్నట్లుగా వైఎస్ షర్మిల సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా అవుతోంది. సెకి ఒప్పంద విషయంలో బాలినేని మీద అటాక్ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వైఎస్ ఫ్యామిలీకి సన్నిహితుడు. బాలినేని జగన్‌కు వరుసకు మామ అవుతారు. ఆయన ఈ మధ్యే జనసేనకు వెళ్లారు. ఇక షర్మిల జగన్ చెల్లి. ఆస్తుల వివాదంతో వాళ్లిద్దరి మధ్య ఇప్పటికే పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. లేటెస్ట్ పవర్ స్కామ్‌ ఇష్యూ కాస్త ఈ ముగ్గురి నేతల కామెంట్స్‌తో జగన్ ఫ్యామిలీలో చిచ్చు క్రియేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇందులో షర్మిల, బాలినేని ఇద్దరు జగన్‌ టార్గెట్‌గా కామెంట్స్ చేస్తుండటం చర్చకు దారి తీస్తోంది.వైసీపీ సీనియర్ నేత..జగన్‌కు వీర విధేయుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..ఒకప్పుడు తమ అధినేతకు వీరవిధేయుడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయటం..రచ్చ క్రియేట్ చేస్తుంది. సెకి ఫైల్ మీద తాను సంతకం చేయలేదని..తాను సైన్ చేయకపోవడంతో క్యాబినెట్‌లో పెట్టి ఆమోదించారని బాలినేని చెప్పడంపై చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనలో ఎమ్మెల్సీ పదవి కోసమే బాలినేని దిగజారి మాట్లాడుతున్నారని చెవిరెడ్డి అంటున్నారు. వైఎస్ ఫ్యామిలీనే రాజకీయ భిక్ష పెట్టిందన్న విషయం బాలినేని మర్చిపోవద్దంటున్నారు. అయితే తనను రాజకీయంగాపైకి తెచ్చింది వైఎస్సారేనని ఓపెన్‌గానే చెప్పానంటున్నారు బాలినేని.వైఎస్ ఫ్యామిలీ అంటే జగన్‌ ఒక్కరేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ, షర్మిల వైఎస్ ఫ్యామిలీ కాదా అంటూ నిలదీస్తున్నారు బాలినేని. ఇలా పవర్‌ స్కామ్ ఇష్యూతో మొదలైన ఈ ఇద్దరి విమర్శలు సైడ్ ట్రాక్ పడుతున్నాయి. జగన్ మంత్రివర్గంలో మంత్రులకు స్వేచ్ఛ ఉండేది కాదని బాలినేని అంటే..అందుకు కౌంటర్‌గా ప్రైవేటు విమానంలో బాలినేని రష్యాకు వెళ్లిన విషయాన్ని చెవిరెడ్డి ప్రస్తావించారు. మిత్రులతో కలిసి ప్రైవేటు జెట్‌లో రష్యాకు వెళ్లటం మంత్రిగా స్వేచ్ఛ అవుతుందా.? అంటూ ప్రశ్నిస్తున్నారు బాలినేని.ఈ సందర్భంగా చెవిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన బాలినేని..ఆయన ఎన్నిసార్లు అమెరికాకు వెళ్లలేదు. అక్కడ ఆయనేం చేసేవారో బయటపెట్టమంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో పవర్ స్కామ్‌ లొల్లి కాస్త..బాలినేని రష్యా టూర్.. చెవిరెడ్డి అమెరికా ట్రిప్‌లు అంటూ కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. ఇవన్నీ అటు తిరిగి ఇటు తిరిగి..పార్టీ అధినేత వైపు వేలు చూపేలా మారాయి.మరోవైపు ఇప్పటికే షర్మిల వ్యాఖ్యలు జగన్‌కు తలనొప్పిగా మారుతున్నాయి. ఇప్పుడు పవర్‌ స్కామ్‌ మీద ఆమె సీబీఐ దర్యాప్తునకు డిమాండ్‌ చేయడం మరింతగా పొలిటికల్ హాట్ టాపిక్ అవుతోంది. అదానీ దేశం పరువు తీస్తే, మాజీ సీఎం జగన్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పరువు తీశారని అంటున్నారు షర్మిల.విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో గౌతమ్ అదానీ నుంచి రూ.1750 కోట్ల ముడుపులు అందుకున్న జగన్‌పై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలంటున్నారు. అంతేకాదు సీఎం చంద్రబాబుకు షర్మిల బహిరంగ లేఖ రాశారు. అదానీతో జగన్ చేసుకున్న పవర్ అగ్రిమెంట్‌ను వెంటనే రద్దు చేయాలని కోరారు. అక్రమ ఒప్పందంతో 25 ఏళ్ల పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై పడే భారం లక్షా 50 వేల కోట్లు రూపాయలని..వెంటనే డీల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు షర్మిల.ఇలా సెకి ఒప్పందం జరిగినప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని..ఇటు సొంత చెల్లి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల..జగన్‌ను కార్నర్ చేస్తుండటం కుటుంబంలో చిచ్చులాగా మారింది. సెకి అగ్రిమెంట్‌తో తనకేం సంబంధం లేదని..తాను సంతకం చేయలేదని చేతులు దులుపుకుంటున్నారు బాలినేని. షర్మిల మాత్రం అన్న తీరుతో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర నష్టం అంటున్నారు.ప్రతిపక్షం విమర్శలు అటుంచితే వరుసకు మామ అయిన బాలినేని..సొంత చెల్లి షర్మిల..పవర్‌ స్కామ్‌ విషయంలో జగన్‌వైపు వేలెత్తి చూపడం కొత్త చర్చకు దారి తీస్తోంది. జగన్ ఫ్యామిలీలో అదానీ వ్యవహారం చిచ్చు పెట్టినట్లు అయింది. ఏకంగా జగన్‌ తప్పు చేశారన్నట్లుగా బాలినేని, షర్మిల చెప్పేస్తున్నారు. దీంతో వైసీపీ డైలమాలో పడిపోయిందట. అయితే బాలినేని వ్యాఖ్యలు మీద వైసీపీ మాజీమంత్రులు స్పందిస్తున్నప్పటికీ..షర్మిల కామెంట్స్‌పై ఆచితూచి స్పందిస్తున్నారు. ఏదైనా ఇలా కుటుంబ సభ్యులచేతే జగన్ విమర్శలు ఎదుర్కోవడం మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది
సెకీతో డీల్ చరిత్ర – ఆరోపణలపై జగన్ పరువునష్టం దావా
సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాల్లో తాను రూ. 1750 కోట్లు లంచం తీసుకున్నట్లుగా ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలపై తాను రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని జగన్ ప్రకటించారు. అమెరికాలో దాఖలైన ఎఫ్‌బీఐ చార్జిషీటులో తన పేరు లేదని స్పష్టం చేశారు. తాను అన్ని వివరాలను చెబుతున్నా కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని తన ప్రతిష్టతను దెబ్బతీస్తున్నారని జగన్ ఆరోపించారు. 2021 సెప్టెంబర్‌ 15వ తేదీన కేంద్ర ప్రభుత్వం నుంచి తియ్యటి కబురుతో లేఖ వచ్చిందని..  యూనిట్‌కు రూ.2.49కే.. మొత్తంగా 9 వేల మెగా వాట్ల పవర్‌ను  ఇస్తామని చెప్పిందని జగన్ స్పష్టం చేశారు.  ఇందులో 2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగా వాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పిందన్నారు.  మేమే పవర్‌ సప్లై చేస్తామని చెప్పిందని మూడో పార్టీ లేదన్నారు.  ఇంటర్‌ స్టేట్‌ ట్రాన్స్‌మిషన్‌ ఛార్జీలు కూడా రాయితీ ఇస్తామని చెప్పిందని దీని వల్ల లక్ష కోట్లు ఆదా అవుతుందన్నారు. ఏపీ చరిత్రలోనే  నిలిచిపోయే ఒప్పందమని జగన్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం చేసుకోకపోతే తననే నిందించేవారన్నారు.   చంద్రబాబు హయాంలో విండ్‌, సోలార్‌ పవర్‌ ఒప్పందాలు రూ.5.90 కి చేసుకున్నారని జగన్ తెలిపారు. 25 ఏళ్లకు లక్షల కోట్ల ఆదాయం కలిసొస్తే.. చంద్రబాబు ఒప్పందాలతో అదే పాతికేళ్లకు 87 వేల కోట్ల నష్టం జరిగేదన్నారు. సెకి ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించామన్నారు.  40 రోజలు అధ్యయనం జరిగిందిని .. 2021 నవంబర్‌ 11న ఏపీఈఆర్సీ అనుమతించిందని జగన్ తెలిపారు. సెకీ ఎవరి నుంచి పవర్ తెస్తుందో తమకు సంబంధం లేదన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్